టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంది నటులు ఉన్నారు. లేడీ కమెడియన్ గా చాలా కొద్ది మంది మాత్రమే పాపులర్ అయ్యారు.  పాత తరంలో సూర్యాకాంతం, గిరిజ,గీతాంజలి లాంటి వారు తమ హాస్య నటనతో మెప్పించారు. ఆ తర్వాత నటి హేమ, కోవై సరళ లాంటి నటీమణులు తమ కమెడీతో కడుపుబ్బా నవ్వించారు.  ఇక బ్రహ్మానందం తో నటి హేమ పండించిన కామెడీ ఎప్పటికీ మరువలేనివి.  దాదాపు 30ఏళ్ల క్రితమే పరిశ్రమాకి వచ్చిన హేమ అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ఎన్నో వేసింది.
Image result for srikanth ra ra movie stills
అలా చిన్నా చితక పాత్రలు ఎన్నో వేసిన తర్వాత గత పదేళ్ళ నుంచి చెప్పుకోదగ్గ పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.  ముక్కుసూటిగా మాట్లాడే హేమ గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ‘మా’ అసోసియేషన్ ఎన్నికల సమయంలో హేమ చేసిన గందరగోళం అంతా ఇంతా కాదు..ప్రస్తుతం ఆమె ‘మా’ అసోసియేషన్ లో కీలక పాత్ర వహిస్తున్నారు.  తాజాగా శ్రీకాంత్ రారా అనే హర్రర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది హేమ.

ఇందులో చాలా రిస్కీ సన్నివేశాల్లో చేశాను అని చెబుతున్న హేమ డూప్ సహాయం లేకుండా స్వయంగా రోప్ కట్టుకొని మరి చేసిందట. చిన్నతనం నుంచి గోడలు దూకడం, ఈత కొట్టడంలో మాస్టర్ అని చెప్పిన ఈమె ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే కనుక గోదావరి నదిలో ఈత కొట్టి ప్రపంచ రికార్డు సాధించేదాన్ని అని చెప్పడంతో అందరు తెగ నవ్వుకున్నారట..నటి హేమ వేసిన జోక్ భలే పేలిందే అని అనుకున్నారట.
Image result for actress hema aunty
ఈ నెల 23న విడుదల కానున్న రారా శ్రీకాంత్ నటించిన మొదటి హారర్ సినిమా. రెగ్యులర్ హారర్ సినిమాల తరహలోనే ఉన్నట్టు ట్రైలర్ లో అనిపిస్తున్నప్పటికీ హీరోతో సహా దర్శక నిర్మాతలు దీని మీద ధీమాగా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: