మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి అంటూ వస్తున్న ఈ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో వస్తుంది. దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన ఈ చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ లోగో ఎనౌన్స్ చేసిన నాటి నుండి రూమర్లు వస్తూనే ఉన్నాయి.


రీసెంట్ గా సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా డౌటే అన్న వార్తలకు చెక్ పెడుతూ సైరాలో అమితాబ్ ఉంటున్నాడని సూరి అమితాబ్ తో దిగిన పిక్ పెట్టి మరి డౌట్లు క్లియర్ చేశారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అసలైతే ఇప్పటికే మొదలవ్వాల్సి ఉంది. కాని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడిందట. 


కేవలం కాస్టింగ్ వల్లే ఈ సినిమా వాయిదా పడుతుందా లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. సినిమా కోసం చిరంజీవి బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమా తెరకెక్కుతుంది.


టైటిల్ లోగోతో సినిమా రేంజ్ ఏంటో చూపించిన సురేందర్ రెడ్డి సినిమాను అన్నివిధాలుగా ది బెస్ట్ అనిపించుకునేలా తీస్తున్నాడట. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనిలేదని చెప్పాడట. మరి సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: