బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పటికీ స్టిల్ బ్యాచ్ లర్ గానే ఉన్నారు.  బాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచులర్ ఎవరంటే వెంటనే ఎవరైనా సల్మాన్ ఖాన్ పేరు చెప్తారు. 50ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు ఈ కండల వీరుడు. అయితే మైనే ప్యార్ కియా సినిమాతో లవర్ బాయ్ గా ముద్ర వేసుకున్న సల్మాన్ జీవితంలో ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు..కానీ ఆయన మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.
Image result for salman khan
మీడియా ముందుకు ఎప్పుడొచ్చినా సల్మాన్ ఖాన్ వచ్చే సంవత్సరం పలానా తారీఖున పెళ్లి చేసుకోబోతున్నానని హామీ ఇవ్వడం ఆ డేట్ పూర్తి అయ్యాక వచ్చే సంవత్సరం అదే డేట్ చెప్పడం..ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు.  సల్మాన్ వివాహం విషయంలో అతడి తల్లిదండ్రులు సైతం సమాధానాలు చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. ఆమద్య తన గర్ల్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  దాంతో సల్మాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించాయి.  తాజాగా పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ ఖాన్. 

Image result for salman khan

పెళ్లికి లక్షలు, కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టలేను. అందుకే పెళ్లి చేసుకోవడం లేదు. మా నాన్న సలీం ఖాన్ కేవలం రూ.180లతో వివాహం చేసుకున్నారు. అందుకే ఐదుగురు పిల్లల్ని పెంచి పోషించగలిగాడు అని అన్నారు.  అయితే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకటిగా చలామణి అవుతుండమే కాకుండా.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్లు గడిస్తున్న సల్మాన్.. డబ్బు లేదని చెప్పడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: