కోలీవుడ్ నటుడు, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల సంక్షేమ సంఘం అధ్యక్షుడు విశాల్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లారు.  విశాల్ ప్రస్తుతం తుప్ప రివాళన్‌ చిత్రంలో  నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో విశాల్‌ గాయపడ్డాడు. దీంతో మోకాలికి గాయమైంది.  తెలుగు హీరో అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డ విశాల్ ఆ మద్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 
Image result for hero vishal
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయాలని ప్రయత్నించినా..అతి తిరస్కరించబడింది.  ప్రస్తుతం హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నారు.  షూటింగ్‌ సమయంలో విశాల్‌ గాయపడ్డ ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు విశాల్‌ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు.
Image result for hero vishal shooting injury
ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విశాల్‌ అక్కడ చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్ళి అక్కడ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ చికిత్స ముగించుకుని, మరో పది రోజుల్లో చెన్నైకు చేరుకుంటారని విశాల్‌ అనుచరులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: