భారతీయ సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి శ్రీదేవి..దుబాయ్ లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే.  గత మూడు రోజులు ఆమె మరణం పై ఎన్నో ట్విస్టులు నెలకొన్నాయి.  మూడు రోజుల తర్వాత శ్రీదేవి భౌతికకాయం మార్చురీ నుంచి బయటకు వస్తోంది. దీనికి సంబంధించిన క్లియరెన్స్ లేఖ భారత కాన్సులేట్ కు అందించింది దుబాయ్ ఎంబసీ. ఈ లేఖ కుటుంబ సభ్యులకు అందించారు అధికారులు. ప్రస్తుతం ఈ లేఖతో మార్చురీ నుంచి శ్రీదేవిని ఎంబాల్మింగ్ కు ప్రక్రియకు తరలించనున్నారు.
Image result for sridevi dead
శ్రీదేవి భౌతికకాయం తరలింపు విషయంలో మంగళవారం కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె పార్థీవదేహాన్ని తరలించేందుకు ఉదయం నుంచి చాలాసేపు ఎదురుచూశారు. ఈ ప్రక్రియ ఆలస్యంగా అవుతుండటంతో తండ్రితో ఉండటానికి బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌ దుబాయ్‌ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ ప్రాసెస్ కంప్లీట్ కావటానికి కనీసం రెండు గంటల సమయం పట్టనుంది.   54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే.
Image result for sridevi dead
గత రెండురోజులుగా ఆమె భౌతికకాయం దుబాయ్‌ పోలీసుల అధీనంలోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్‌ పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విభాగం విచారణ జరిపాయి. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Image result for sridevi dead
ఈ సాయంత్రం 5 గంటలకు ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసురానున్నారు. జర్నీ సమయం మూడు గంటలు పడుతుంది. అంటే ఈ రాత్రి 9, 10 గంటలకు ముంబై చేరుకోనుంది శ్రీదేవి భౌతికకాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: