బాలీవుడ్ లోకి జిస్మ్ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫోర్న్ భామ సన్నీలియోన్ ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు ఐటమ్ సాంగ్స్ తో మురిపించింది.  బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా వచ్చినా..ఎక్కువ శాతం ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది. అయినా కూడా ఏ హీరోయిన్ కి రాని క్రేజ్ సన్నీలియోన్ కి వచ్చింది.  ఒకరకంగా చెప్పాలంటే..అప్పట్లో నెటిజన్లు ఎక్కువ సన్నిలియోన్ నే ఫాలో అయ్యారని గూగుల్ తెలిపింది.  అయితే సన్నీలియోన్ ఫోర్న్ చిత్రాల్లో నటించినప్పటికీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిందట. కానీ, ఈ అమ్మడు తాను నటించే ఏ పాత్ర అయినా చాలా హాట్ గా శృంగారభరితంగా ఉంటాయి.  అయితే ఇప్పుడు వీటన్నింటికి భిన్నంగా సన్నీలియోన్ ఓ జానపద చిత్రంలో నటిస్తుంది. 
Image result for sunny leone
తొలి సారి సౌత్‌లో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళ, మలయాళం,హిందీ భాషల్లో రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కిస్తుండ‌గా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ మద్య షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Image result for sunny leone
కత్తి, విల్లు పట్టుకుని ఆవేశంగా చూస్తున్న స‌న్నీలియోన్‌ పోస్ట‌ర్‌ని ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నీని చూస్తుంటే రుద్ర‌మదేవి చిత్రంలో అనుష్క‌కి కాపీగా ఉంద‌నే అభిప్రాయం జ‌నాల‌లో క‌లుగుతుంది. కత్తి పట్టి వీరత్వం, రౌద్రం, పౌరుషం ప‌లికించేందుకు బాగానే ట్రై చేసిన‌, ఇది సన్నీకి వ‌ర్క‌వుట్ కాదేమోన్న అనుమానాల‌ని నెటిజన్స్ వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీంకు సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లని ఇచ్చినట్లు సమాచారం.
Image result for sunny leone veeramadevi
ఈ చిత్రంలో స‌న్నీ పవర్ ఫుల్ క్వీన్ గా కనిపించనుండగా నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.  అయితే ఈ పోస్టర్ మక్కికి మక్కీలా ఉందని..అనుష్క రౌద్రం సన్నిలియోన్ లో లేకపోవడం ఒకటైతే..అచ్చం అలాంటి స్టైల్ ఎలా విడుదల చేస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: