పాలనురగ లాంటి అందం తమన్నాది. అంతకుమించి సన్నజాజి  సౌకుమార్యం, పూలతీగ ఒంపు సొంపులు, మెరుపు తీగ తేజస్సు, ఆమె సొంతం. దీంతో  కథానాయిక  తమన్నా ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను మిల్కీ- బ్యూటీ అని పిలుస్తున్నామంటే ఆమె అందం ఎంత సుకుమారమో అర్ధమైపోతుంది.
Image result for slim beauty tamanna
"బాహుబలి" లో అవంతిక పాత్రలో ఆమె ఒలికించిన అందాలు వయ్యారాలు నయగారాలు  అంతటి సౌందర్య సౌకుమార్య సొగసుల వర్షం కురిపించే సమయలో ఆమె సన్న జాజి మల్లె లాగా మెరుపు తీగ లాగా కనిపించిందంటే ఈ ముద్దుగుమ్మ అదే ఎంత ఫిట్‌-నెస్‌ మెయింటెయిన్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. సన్నగా కనిపిస్తూ, యుద్ధ విన్యాసాలు ఎంత చక్కగా చేసి మెప్పించిందో చెప్పాలంటే బాష చాలదు. 

ఇదంతా తమన్నా తన ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తారని, భారీగా వర్క్‌-వుట్‌లు కూడా చేస్తారని అందరికీ అనుమానం రావచ్చు. అయితే ఆరోగ్యవంత మైన జాగ్రత్తలు  జిమ్‌ లో గడపడం వంటి విషయాలు పక్కన బెడితే ఆమె ఒక కప్పు కాఫీ తోనే తన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారట. అయితే, మాములు కాఫీకాదు, "బటర్‌-కాఫీ" సాధారణంగా మనం బటర్‌-మిల్క్‌ వింటాం గానీ, ఈ బటర్‌-కాఫీ ఏమిటి? అని ప్రశ్నించగా ఇది తన "ఆరోగ్య రహస్యం" అని చెప్పారు. 
Image result for slim beauty tamanna
కాఫీలో బటర్‌-మిక్స్‌ చేసి తాగితే దేహంలోని కొవ్వు మొత్తం బటర్ తో కలిసి కరిగిపోతుందని, అది హృదయానికి మంచిదని, రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెప్పారు. తన రోజును బటర్‌-కాఫీ తోనే ప్రారంభిస్తానంటూ ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక మనం మొదలెడదామా! 

Image result for butter coffee by Tamanna

మరింత సమాచారం తెలుసుకోండి: