రేపటి నుంచి దక్షిణ భారతదేశంలోని ధియేటర్లు అన్నీ మూతబడపోతున్నాయి. దక్షిణాది సినిమా రంగానికి చెందిన సినిమా నిర్మాతలకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో మార్చి 2నుండి ధియేటర్లు మూసివేయడానికి నిశ్చయించారు. 
RAM CHARAN RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ సమ్మె ఆషామాషీగా ఏమీ ఉండదని తెలుస్తోంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దిగొచ్చి నామమాత్రపు ధరకు ప్రొజెక్టర్లను అద్దెకిస్తే తప్ప సమ్మె విరమించేది లేదని నిర్మాతలు చెపుతున్నారు. అయితే మార్చి రెండు మూడు వారాలలో విద్యార్ధులకు పరీక్షలు వల్ల కలక్షన్స్ నామ మాత్రంగా ఉంటాయి అన్న ఆలోచనలతో నిర్మాతలు ధియేటర్స్ ఓనర్స్ ఇలా సమ్మెకు దిగుతున్నారని మార్చి నెలాఖరు వస్తే నిర్మాతలే రాజీకి వస్తారని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడ తమ బెట్టును మరింత కొనసాగిస్తున్నాయి.
RAM CHARAN RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థుతులు మార్చి చివరి వారంలో విడుదల కావలసిన చరణ్ ‘రంగస్థలం’ కు సమస్యగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఈ సమ్మె మరింత ఉదృతం అయి ఈ మార్చి నెలాఖరు వరకు కొనసాగితే ‘రంగస్థలం’ తన రిలీజ్ డేట్ ను మార్చుకోవలసిన పరిస్థుతులు ఏర్పడుతాయి. అదే జరిగితే ఈసినిమా తరువాత విడుదల కావలసిన మహేష్ ‘భరత్ అనే నేను’ అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ రిలీజ్ షెడ్యూల్స్ అన్నీ తారుమారు అవుతాయి.
RAM CHARAN RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కేవలం ఈమూడు సినిమాలు పైనే ఈ సమ్మర్ సీజన్ ను నమ్ముకుని సుమారు 300 కోట్ల బిజినెస్ అయిన నేపధ్యంలో ‘రంగస్థలం’ రిలీజ్ డేట్ లో వచ్చే మార్పులు టాలీవుడ్ ఇండస్ట్రీ సమ్మర్ బిజినెస్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టే ఆస్కారం ఉంది. ఇప్పటకే చరణ్ సినిమాల స్థాయికి మించి ఈమూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో లేటెస్ట్ గా కలవర పెడుతున్న ఈ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల సమ్మె ‘రంగస్థలం’ కు ఊహించని తలనొప్పులు తెచ్చి పెడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: