శ్రియ శరణ్.. టాలీవుడ్ లో ముదురు భామ. ఒక్క టాలీవుడ్ ఏంటి.. అన్ని వుడ్ లలోనూ నటించిన శ్రియ ఇప్పటికీ బాగానే రాణిస్తోంది. సినిమాల్లోకి ఎంటరైనప్పటి నుంచి ఇప్పటి దాకా సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అందర్నీ షాక్ కు గురిచేస్తోందీ భామ. కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ బాగానే సంపాదిస్తోంది కూడా.. ఇప్పుడు మరో స్టెప్ వేయబోతోంది.

Image result for sriya

అబ్బే.. నాకా.. పెళ్లా.. అంటూ ప్రతీసారీ వార్తలను కొట్టిపారేసిన  శ్రియ… ఎట్టకేలకు మ్యారేజ్ కు రెడీ అయ్యింది. రష్యన్ యవకుడితో ఉన్న ప్రేమ కాస్త పెళ్లిగా మారబోతుంది. మార్చి 17,18,19 తేదీలో ఈమె మూడు రోజుల పెళ్లి చేసుకోబోతోంది. ప్రజంట్ శ్రీయ తల్లిదండ్రులు పెళ్లి సన్నాహాల్లో బిజీ అయ్యారట. హొలీ థీమ్ తో హిందూ సంప్రదాయాల ప్రకారం ఇద్దరూ ఒకటవ్వబోతున్నారని ఇంటర్నల్ టాక్.

Image result for sriya

సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 18 సంవత్సరాల పాటు గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన బ్యూటి శ్రియ శరణ్. కొంత గ్యాప్ తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ లేడీ.. సరికొత్త పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. రీసెంట్ గా  గాయత్రి చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శ్రియ  ఇప్పుడు పెళ్లికి  రెడీ అయిందని  బి టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.  కొంతకాలంగా శ్రియ ఓ రష్యన్ యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది.. త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే  శ్రియ కాబోయే అత్త మామలని రష్యా వెళ్లి కలిసి వచ్చిందంటూ బీటౌన్ లో టాక్ వినిపిస్తుంది.

Image result for sriya

ఎలా చూసినా మార్చి 17 -18 -19 తేదీల్లో రష్యన్ స్పోర్ట్స్ మాన్ ఆండ్రీ కోస్చీవ్ తో శ్రియ ఉదయిపూర్ లో మూడు రోజుల పెళ్లి చేసుకుంటోంది. 19న వివాహం జరుగుతుంది. దాని తరువాత సంగీత్, మెహందీ కార్యక్రమాలను నిర్వహించేందుకు  అరేంజ్ మెంట్స్ అన్ని చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయట. హొలీ థీమ్ తో హిందూ సంప్రదాయాల ప్రకారం ఇద్దరూ ఒకటవ్వబోతున్నారని ఇంటర్నల్ టాక్. ఇక తన స్నేహితులకు, సహచర నటులకు శ్రియా స్వయంగా ఫోన్ చేసి పెళ్లికి ఆహ్వానిస్తున్నదని సమాచారం. ఏదైతేనేం.. శ్రియ మరో స్టెప్ ముందుకేసి ఏడడుగులు నడవబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: