భారతీయ చలన చిత్రం రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన గొప్ప నటి శ్రీదేవి.  ఇండస్ట్రీలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీలో మూడు తరాల హీరోలతో హీరోయిన్ గా నటించిన ఘనత ఆమెకే దక్కుతుంది.

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయింది శ్రీదేవి.  దాదాపు పదమూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 
Image result for sridevi bharat ratna
ఈ మద్య మామ్ చిత్రంతో అభిమానులను అలరించిన శ్రీదేవి దుబాయ్ లో బంధువుల వివాహ వేడుకకు హాజరై అనుకోని ప్రమాదంతో మృతిచెందింది.  అయితే ఆమె మృతిపై  ఎన్నో అనుమానాలు ఉన్నాయని దుబాయ్ పోలీసులు రెండు రోజులు విచారణ జరిపి.. ప్రమాద వశాత్తు బాత్ రూమ్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందని సర్టిఫై ఇచ్చి భారత్ పంపారు.  వేలాది అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రముఖ నటి శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి శారద భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Related image
చెన్నైలోని ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియే షన్‌ (ఆస్కా) ఆధ్వర్యంలో గురువారం శ్రీదేవికి అశ్రునివాళి అర్పించారు.  సంస్మ రణ సభలో నటి శారద మాట్లాడుతూ.. శ్రీదేవితో కలసి పని చేసిన గత స్మృతు లను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవిని పప్పి అని ముద్దుగా పిలిచేదాన్ని అని తెలిపారు. శ్రీదేవి దేశానికి దక్కిన కోహినూర్‌గా ఆమె అభివర్ణించారు. తాను వయసులో మాత్రమే శ్రీదేవి కంటే పెద్దదానినని, నటన సహా మిగతా విషయాల్లో ఆమె కంటే తాను తక్కువేనని పేర్కొన్నారు.
Related image
షూటింగ్ జరిగే సమయాల్లో కూడా శ్రీదేవి చాలా సౌమ్యంగా ఉండేదని..తాను స్టార్ హీరోయిన్ అన్న గర్వం ఎక్కడా ఉండేది కాదని ఆమె గుర్తు చేశారు.   ‘కార్తీకదీపం’ సినిమా షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి శోభన్‌బాబు, తాను ఆశ్చర్యపోయినట్టు గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప నటి ఆమె అని కొనియాడారు. ఆమెకు భారతరత్న దక్కితే ఆ అవార్డుకే అందం వస్తుందని శారద అన్నారు.  శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: