దక్షిణ భారతదేశం లోని థియేటర్ యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. ఫలితంగా ఐదు రాష్ట్రాల్లో థియేటర్లలో శుక్రవారం నుంచి బొమ్మపడదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్న చిత్రసీమలన్నీ ఏకమై సినిమా థియేటర్లను మూసివేశాయి. ఫలితంగా శుక్రవారం నుంచి సినిమాలను ప్రదర్శించవు. 
Image result for virtual print fees 
ఈ మేరకు దక్షిణాది నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మార్చి 2వ తేదీ శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో సమావేశమైన దక్షిణాది నిర్మాతల మండలి ఈ నిర్ణయం ఫైనల్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 Image result for virtual print fees
ప్రాంతీయ సినిమాలకు "వర్చ్యువల్ ప్రింట్ ఫీజు - వీపీఎఫ్"  తగ్గించాలని "డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల" ను వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ధరలో కనీసం 25 శాతం ఛార్జీ తగ్గింపును కోరారు. ఇందుకు సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించలేదు. 9 శాతం వరకు తగ్గిస్తామని చెప్పారు. ఇందుకు నిర్మాతల మండలి ఒప్పుకోలేదు. 

Image result for virtual print fees


ఇంగ్లీష్ సినిమాలకు వీపీఎఫ్‌ ను వసూలు చేయడం లేదనీ, దక్షిణాది సినిమాలకే ఎందుకు ఇంత ధర వసూలు చేస్తున్నారని సురేష్ బాబు ప్రశ్నించారు. అందువల్ల తమ ప్రధాన డిమాండ్‌పై "డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు" దిగివచ్చేవరకు థియేటర్ల బంద్ చేస్తున్నట్టు ప్రటించారు. ఈ బంద్‌ కు ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు మద్దతు ప్రకటించారు. 

Image result for virtual print fees

అయితే, ఇలా సినిమా థియేటర్లు మూతబడే పరిస్థితి వచ్చినా, దాని గురించి ఎక్కువగా డిస్కషన్స్ జనాల్లో జరగడం లేదు. ఇందుకు కారణం, ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్. సినిమా ధియేటర్లకు జనాలు వెళ్లేదే ఎంటర్టెయిన్మెంట్ కోసం. సినిమాలు లేనంత మాత్రాన, ఎంటర్టెయిన్మెంట్ కేమీ ఢోకా లేదు.


దక్షిణ భారతంలో సినిమా హాళ్ళు బంద్

టీవీల్లోను, ఇంటర్నెట్ లోను కావాల్సినంత వినోదం లభిస్తోంది.అమెజాన్-ప్రైమ్,  నెట్-ఫ్లిక్స్, సన్-నెక్ట్స్ లాంటివి వచ్చాక అన్నీ ఇంటి దగ్గరే హై-క్వాలిటీతో చూసే అవకాశం లభిస్తోంది. అందుకే జనాలు ఈ బంద్ గురించి పట్టించుకోవడం లేదు. మరోవైపు సినిమాలకు మహారాజ పోషకులు అంటే కుర్రకారు. ఆ తర్వాత ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ మార్చ్ వచ్చిందంటే ఎగ్జామ్స్ సీజన్ బిగిన్ అయిపోతుంది. స్టూడెంట్స్ అంతా చదువుల్లో పడిపోయారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ నెల చివరి వరకూ సినిమాలకు దూరంగానే ఉంటారు. వారి వారి పిల్లలను చదివించుకోవడం, పరీక్షలకు సన్నద్ధులు చేయడం తోనే వారికి సరిపోతుంది.


దక్షిణ భారతంలో సినిమా హాళ్ళు బంద్

ఇక థియేటర్ల వారికి కూడా ఈ బంద్ కారణంగా పెద్దగా నష్టాలు రాకపోవచ్చు. ఎందుకంటే ఎలాగూ కొత్తగా పెద్ద సినిమాలేమీ వచ్చేయవు. వచ్చినవాటితో థియేటర్ల బాక్సులు బద్దలై పోయే కలెక్షన్స్ కూడా రావు. అందుకే వీరు కూడా ఇప్పుడు బంద్ గురించి పెద్దగా బెంగ పెట్టుకోవడం లేదు. మొత్తానికి థియేటర్లన్నీ మూతపడుతున్నా ఆల్-హ్యాపీస్ అన్నట్లుగానే ఉంది సిట్యుయేషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: