తెలుగు ఇండస్ట్రీలో అతి కొద్ది మంది స్టార్ డైరెక్టర్ లు ఉన్నారు..అందులో ఒకరు బోయపాటి శ్రీనివాస్. బోయపాటి తీసిన సినిమాల్లో యాక్షన్, పంచ్ డైలాగ్స్, సెంటిమెంట్ అన్నీ కలిసి ఉంటాయి..ఒకప్పుడు బాలకృష్ణతో ‘లెజెండ్’ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో..రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.  ఆ మద్య అల్లు అర్జున్ ‘సరైనోడు’, బెల్లం కొండ శ్రీనివాస్ తో జయ జానకీ నాయక లాంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న బోయపాటి తాజాగా మెగా అబ్బాయి రాంచరణ్ తో ఓ సినిమా తీయబోతున్నాడు.
Related image
మాస్, సెంటిమెంట్ లో ఉండబోయే ఈ చిత్రంలో రాంచరణ్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ను ఈ నెల 6వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. చరణ్ .. తదితరులపై ఈ యాక్షన్ సీన్స్ వుండనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు బోయపాటి రెమ్యూనరేషన్ చూస్తే అందరూ షాక్ అవుతారు.   
Image result for sarinodu
ఈ సినిమాకి ముందువరకూ ఆయన 10 కోట్ల వరకే తీసుకున్నాడట. ఈ సినిమాతో తొలిసారిగా ఆయన 15 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నాడని అంటున్నారు. రాజమౌళి విషయాన్ని పక్కన పెడితే, పారితోషికం విషయంలో త్రివిక్రమ్ .. కొరటాల సరసన తాజాగా బోయపాటి కూడా చేరిపోయాడని చెప్పుకుంటున్నారు.
Related image
డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో చరణ్ న్యూ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే.    యపాటి తీసిన సూపర్ హిట్ మూవీస్ విషయానికి వస్తే సరైనోడు రూ.70కోట్లు వసూలు చేసింది. లెజెండ్ మూవీ 40కోట్లు, జయజానకీ నాయక 21కోట్లు రాబట్టింది దీంతో బోయపాటి అంత రెమ్యునరేషన్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని టాలీవుడ్ టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: