మహిళా సాధికారితతోనే మార్పు వస్తుంది అని భావిస్తున్న వర్తమాన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్యత మధ్యనే మహిళలు నలిగిపోతున్నారు అన్నది వాస్తవం. స్త్రీలను దేవతలతో పోల్చి చూస్తారు కానీ ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలోనే కాదు కుటుంబాలలో కూడ చిన్న చూపు కొనసాగుతోంది అన్నది వాస్తవం. ఈక్రమంలో మహిళాభ్యుదయం జరగాలి మహిళల అభివృద్ధి జరగాలి అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని జరిగినా స్త్రీల సామాజిక ఆర్ధిక రాజకీయ అభివృద్ధి ఇంకా కేవలం నామమాత్రంగానే ఉంది అన్నది వాస్తవం. మనదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు ఉపాది ఆహారబద్రత లేకపోవడంతో పాటు స్త్రీల పై లైంగిక హింస ఇంటా బయటా వయస్సుతో నిమిత్తం లేకుండా పెరిగి పోవడం చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగితే మహిళల అభివృద్ధి జరుగుతుంది అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు.   
women's day 2018photos కోసం చిత్ర ఫలితం
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు అన్నది నిజం. ఈ వాస్తవాన్ని గుర్తించి  స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగితే మహిళా అభ్యుదయం దానంతట అదే జరుగుతుంది. ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుడితే దురదృష్టంగా భావిస్తున్న సగటు మనిషి ఆలోచనల నేపధ్యంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా మహిళల అభివృద్ధి సంక్షేమం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతోంది. 
women's day 2018photos కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఉత్తారాది రాష్ట్రాలలో ప్రతి 1000 మంది పురుషులకు 879 మాత్రమే అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు చెపుతున్న నేపధ్యంలో మరో 100 సంవత్సరాలు గడిచేసరికి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 500 లకు పడిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ మనదేశంలోని మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీని ఒక పనిచేసే యంత్రంగా బావిస్తున్న నేపధ్యంలో ఇంటిపని పిల్లల పని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలిగే ఒక ‘రోబోలా’ మాత్రమే స్త్రీలను చూస్తున్నారు అన్నది వాస్తవం. ఈ పరిస్థుతులకు ఎవరో పరిష్కారాలు చెపుతారని ఆశించకుండా స్త్రీలు తమని తాము తెలుసుకుని తమ శక్తియుక్తులు మెరుగు పరుచుకునే వరకు ఎన్ని మహిళా ఉద్యమాలు మహిళా దినోత్సవాలు జరిగినా స్త్రీల పై వేదింపులు స్త్రీలను చిన్న చూపు చూడటం కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం. 
women's day 2018photos కోసం చిత్ర ఫలితం
‘ఒక పని గురించి చెప్పాలి అంటే పురుషులకు చెప్పండి అదే ఆ పని పూర్తి అవ్వాలి అంటే మాత్రం మహిళకు చెప్పండి’  అని ఉక్కు మహిళగా పేరుగాంచిన బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ చెప్పిన మాటలను బట్టి మహిళా ఏదైనా సాధించాలి అనుకుంటే ఏ శక్తి ఆపలేదు అన్నది వాస్తవం. ఐస్ ల్యాండ్ లాంటి చిన్నదేశంలో మహిళను అసభ్యకరంగా చూపించే సినిమాలు వీడియాలు తీసినవారికి ఎటువంటి వాదన ప్రతివాదనలు లేకుండా వెంటనే కఠిన శిక్షలు విధించే చట్టాలు ఉన్నాయి. అంతేకాదు ఆదేశ పార్లమెంట్ లో మహిళలకు సంబంధించిన ఆదేశ మహిళలే రూపొందిస్తారు. అటువంటి పరిస్థుతులు మన భారతదేశంలో వచ్చిన నప్పుడు మాత్రమే నిజమైన మహిళా సాధికారిత. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు అందరికీ ఇండియన్ హెరాల్డ్ శుభాకాంక్షలు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: