సాధారణంగా సెలబ్రెటీలు బయటికి వెళ్తే..ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా స్టార్ హోదా వచ్చిన హీరో, హీరోయిన్లు ఏవైనా ఫంక్షన్లు, ఓపెనింగ్స్, ఆడియో ఈవెంట్స్ కి వెళ్లినపుడు కట్టుదట్టమైన భద్రత ఉంటుంది. వారి చుట్టూ బౌన్సర్లు ఉంటారు..అభిమానులు వారి వద్దకు వచ్చినా..హాయ్ అంటూ అక్కడ నుంచి వెళ్లి పోతుంటారు. అయినా కొన్ని సార్లు అభిమానుల తాకిడి ఎక్కువై నానా ఇబ్బందులు పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. ఆ మద్య తమిళ హీరో సూర్య అభిమానులను తప్పించుకోవడానికి ఏకంగా గేటు దూకి మరీ పారిపోయారు. 
Image result for monal gajjar hot
తాజాగా ఓ హీరోయిన్ కి చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి ఏకంగా ఆమె కారు టైర్ పై మూత్ర విసర్జన చేయడంతో మ్యాటర్ సీరియస్ అయ్యింది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, తన స్నేహితురాలితో కలసి అంబావాడీ ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ కు మోనల్ గజ్జర్  వెళ్లింది. మాల్ ఎదుట ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేసింది.
Image result for monal gajjar hot
ఇక షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన మోనాల్ షాక్ కి గురైంది..  ఓ వ్యక్తి తన కారు టైరుపై మూత్ర విసర్జన చేస్తుండటాన్ని గమనించింది. వెంటనే కంగారు పడ్డ ఆమె... అతడిని వారించే ప్రయత్నం చేసింది. అయినా, అతను పట్టించుకోకుండా, పని పూర్తి చేసేశాడు.  దీంతో చిర్రెత్తుకొచ్చిన మోనాల్ వెంటనే  పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Image result for monal gajjar hot
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో సదరు వ్యక్తి ఓ దుకాణాన్ని నిర్వహిస్తుంటాడని పోలీసులు తెలిపారు. గుజరాత్ కు చెందిన మోనల్ గజ్జర్... టాలీవుడ్ లో ''వెన్నెల వన్ బై టూ', 'సుడిగాడు', 'బ్రదరాఫ్ బొమ్మాళి' తదితర చిత్రాల్లో నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: