తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు.  పుట్టింది కేరళా అయినా..పెరిగింది మాత్రం హైదరాబాద్ లో అందుకే ఈమెకు మళియాళ,తెలుగు, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు ఉంది. టివి సిరియల్ లో నటించిన సుమ తన సహనటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
Image result for anchor suma family
ఎంతో సాంప్రదాయంగా కనిపించే సుమ తన మాటల్లో హుందాతనం, చిలిపి మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఇక సినిమా ఆడియో ఫంక్షన్లు ఏవైనా సరే ముందు సుమకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటే..ఆమె వ్యాఖ్యానం ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ సుమ మహిళలకు ఓ అద్భుతమైన సందేశాన్ని అందించారు. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఒకరికి ప్రత్యేకంగా అభినందించుకోవాలి.  వారు ఎవరో కాదు..నేనే..అంటూ చిలిపిగా మందలించింది.
Image result for anchor suma anchoring
నేను ఇంత పని చేసుకున్నందుకు, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నందుకు. మీకు ఆకలి వేస్తె ఆలోచించకుండా తినేయండి.  మీరు ఎవరి కోసం ఆగకండి..ఎందుకంటే ముందు మీ కడుపు నిండితే.. మీరు వేరే వారి కడుపులు నింపుతారు. మీ ఆరోగ్యం బాగుందనుకోండి మీ కుటుంబం మొత్తం ఆరోగ్యగా ఉంటుంది. సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.. ఈసారి నినాదం టేక్ కేర్ అఫ్ యూర్సెల్ఫ్ .. హ్యాపీ ఉమెన్స్ డే అంటూ తన సందేశాన్ని ముగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: