రాధికా ఆప్టే.. ఈ పేరు సుపరిచితం. బోల్డ్ కేరక్టర్స్ చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.! సినిమాల్లో కేరక్టర్స్ మాత్రమే కాదు.. నిజజీవితంలోనూ బోల్డ్ గా ఉండడం ఈమె స్పెషాలిటీ. ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా చెప్పడంలో రాధికా తర్వాతే ఎవరైనా..! తాజాగా నెట్ లో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..

Related image

రాధికా ఆప్టే ఇటీవల తన భర్త బెనెడిక్ట్ టేలర్ తో కలిసి గోవా వెళ్లింది. అందమైన బీచ్ లకు గోవా పెట్టింది పేరు. గోవా బీచ్ లో సేద తీరుతున్న ఫోటోను ఆప్టే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే.. నెట్ లో కామెంట్స్ వెల్లువెత్తాయి. చాలా మంది ఫోటోలు బాగున్నాయంటూ పొగిడారు. కొంతమంది ఆకతాయిలు మాత్రం.. బికినీ వేసుకున్నావేంటి.. అని గద్దించినట్టు పోస్టులు పెట్టారు. దీనిపై మీడియా వాళ్లు మీ కామెంట్ ఏంటన అడిగినప్పుడు రాధికాకు చిర్రెత్తుకొచ్చింది. బీచుల్లో బికినీలు కాకుండా చీర కట్టుకోమంటారా..? అని రివర్స్ అటాక్ చేసింది.

Image result for radhika apte hot

ఇలాంటివన్నీ చెత్త విషయాలని, తాను పెద్దగా పట్టించుకోనని రాధికా తేల్చిచెప్పింది. ఇలాంటి కామెంట్స్ ఎవరు చేస్తున్నారో నాకు తెలీదు. వారి గురించి నేను పెద్దగా ఆలోచించను అని చెప్పుకొచ్చారు. బీచుల్లో బికినీలు కాకుండా చీర కట్టుకుని తిరగమంటారా.. అని నిలదీశారు. దీంతో మీడియా వాళ్లు షాక్ కు గురయ్యారు.

Image result for radhika apte with boyfriend beach

ఇటీవల ప్యాడ్ మ్యాన్ సినిమాతో రాధికా మరోసారి సక్సెస్ సాధించారు. తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ సినిమాల్లో నటించారు. రక్త చరిత్ర ద్వారా ఆమె తొలిసారి తెలుగువారికి పరిచయమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: