నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాని డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కృష్ణా, అర్జున్ రెండు పాత్రల్లో నాని డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే కృష్ణా పాత్ర మాస్ లుక్ తో ఉండగా.. అర్జున్ పాత్ర స్టైలిష్ గా ట్రై చేశాడు.


అయితే ఈ రెండు లుక్స్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. మాస్ ఇమేజ్ కోసమే కృష్ణా పాత్ర అంటూ కామెంట్ చేస్తూ, అర్జున్ పాత్రలో నాని స్టైలిష్ లుక్ కూడా అంతగా ఇంప్రెస్ చేయలేదు అన్నది టాక్. మరి ఈ రెండు పాత్రలపై కామెంట్స్ ఎలా ఉన్నా సినిమా మాత్రం కామెడీ ఎంటర్టైనర్ గా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. 


ఎక్స్ ప్రెస్ డైరక్టర్ మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుస్కార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్ అయితే ఎంటర్టైనింగ్ సినిమాగా అనిపిస్తున్నా వచ్చిన ఈ నెగటివ్ టాక్ కు సంబంధం లేకుండా నాని హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఈ సినిమాతో కూడా హిట్టు పక్కా అంటున్నాడు.


2017 డిసెంబర్ లో ఎం.సి.ఏ అంటూ వచ్చి హిట్ అందుకున్న నాని కృష్ణార్జున యుద్ధం తో వస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జునతో మల్టీస్టారర్ చేస్తున్న నాని విక్రం కుమార్ తో మరో సినిమా లైన్ లో పెట్టాడని అంటున్నారు. మరి నాని రేంజ్ ఈ సినిమా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: