తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  మళియాళ భామ అయినప్పటికీ..తెలుగులో చాలా అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు అమ్మాయిగా అందరితో కలిసిపోయింది. అంతే కాదు ఏం మాయ చేసావే చిత్రంలో సహనటుడు అయిన అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
Image result for rangasthalam samantha
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని ఫ్యామిల కోడలు సమంత.  కేవలం గ్లామర్ కే ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్న సమంత ‘రంగస్థలం’ చిత్రంతో రామలక్ష్మి పాత్రకు ప్రాణం పోసిందట.  1985 కాలం నాటి గ్రామీణ వాతావరణానికి తగ్గట్టు సాధారణ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది సమంత.  ఇండస్ట్రీలో  అందం సంగతి పక్కనపెడితే.. అంకితభావం విషయంలో "సమంత ది బెస్ట్" అంటుంటారు హీరోలు. 
Image result for rangasthalam samantha
అంతే కాదు సెట్స్ లో సమంత చాలా అనుకువగా ఉండటం..ఒక సీన్ అద్భుతంగా రావడానికి ఆమె పడే తపన చూస్తుంటే కో-స్టార్స్ ఎంతో సంతోషిస్తారట. ఇప్పుడీ లిస్ట్ లోకి రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. సమంత పక్కనుంటే ఓ నటుడికి మంచి సపోర్ట్ దొరుకుతుందంటున్నాడు రామ్ చరణ్.  ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుందని..ఇప్పటి వరకు నటించిన హీరోయిన్లు ఒక ఎత్తు అయితే..సమంతతో నటించడం కొత్త అనుభూతి కలిగించిందన్నారు రామ్ చరణ్. సమంతతో చేసినప్పుడు చాలా ఎనర్జీ వచ్చింది.
Image result for rangasthalam samantha
మనపై మనకు ఓ నమ్మకం కలిగిస్తుంది సమంత. ఓ మంచి కో-స్టార్ దొరికితే ఏ నటుడికైనా బాగా నటించడానికి అవకాశం దొరుకుతుంది. రంగస్థలంలో ప్రతి సీన్ ఇంత అందంగా రావడానికి సమంత కూడా కారణం అన్నాడు. ఇక దర్శకులు సకుమార్ మాట్లాడుతూ..నా స్టేట్ మెంట్ ను కాస్త కాంట్రవర్సీగా తీసుకోవద్దు.
Image result for rangasthalam samantha
జీవితాంతం నాగచైతన్యతో సమంత ఎలాగైతే ఉంటుందో.. అలా నాకు కూడా జీవితాంతం సమంతతో సినిమాలు చేయాలని ఉంది అన్నారు లెక్కల మాస్టారు. ఆమెకు 30ఏళ్లు వస్తే అలాంటి పాత్రే చేస్తాను. 40ఏళ్లు వస్తే ఆ టైపు క్యారెక్టరే చేయాలనుంది. సమంతను చూసి అంతలా ఇంప్రెస్ అయిపోయా అంటూ తెగ మెచ్చుకున్నాడు. 

Related image


మరింత సమాచారం తెలుసుకోండి: