ఉగాది పండుగ రోజున రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న ‘నేల టిక్కెట్టు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా అనిపించడంతో ఈమూవీ రవితేజాకు మరో హిట్ మూవీగా మారుతుంది అన్న ప్రాధమిక అంచనాలు వినపడ్డాయి. 
RAVITEJA NELATICKET FIRST LOOK కోసం చిత్ర ఫలితం
అయితే ఈ ఫస్ట్ లుక్ విడుదల అయ్యాక ఈమూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఘన విజయం తరువాత రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక స్టోరీ లైన్ అనుకుని ఆ కథకు ‘సన్నాఫ్ శంకర్ దాదా’ అన్న టైటిల్ కూడ అనుకుని చరణ్ ను కలవడం జరిగిందట.
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
చరణ్ కు ఈ టైటిల్ బాగా నచ్చడంతో కళ్యాణ్ కృష్ణను ఈకథను డెవలప్ చేసి స్క్రిప్ట్ కింద మార్చమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆతరువాత రామ్ చరణ్ ఆలోచనలు మారిపోవడంతో కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ బాగాలేదు అంటూ సాకులు చెప్పి ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పించుకున్నట్లు ఫిలింనగర్ టాక్. 
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే చరణ్ కు ‘సన్నాఫ్ శంకర్ దాదా’ టైటిల్ బాగా నచ్చడంతో చరణ్ సన్నిహితులతో చెప్పి ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నట్లు ఫిలింనగర్ గాసిప్. దీనితో తాను చరణ్ తో తీయాలి అనుకున్న కథతో పాటు టైటిల్ కూడ చేయి జారిపోవడంతో కళ్యాణ్ కృష్ణ కొంత కాలం అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. దీనితో ఈ విషయాలన్నీ తెలుసుకున్న రవితేజ కళ్యాణ్ కృష్ణను పిలవడం ఆ కథకు ఓకె చెప్పడం అదే కథ ‘నేల టిక్కెట్టు’ గా మారింది అని అంటున్నారు. సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ మేలో విడుదల కాబోతున్న ఈమూవీ విజయం సాదిస్తే ఒక మంచి కథను పోగొట్టుకున్నాను అని చరణ్ ఫీల్ అవుతాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: