ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న చీకటి నిజాలు బయటకు వస్తున్నాయి.  సినీ అవకాశాల మాటు జరుగుతున్న చీకటి కోణాల్ని ప్రస్తుతం హీరోయిన్లు ఒక్కొక్కరుగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. మీ టూ అంటూ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఉద్యమమే జరుగుతోంది.  తాజాగా హీరోయిన్ మాధవి లత సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురుగా చేదు అనుభవాల గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.
శరీరమే లంచం
నచ్చావులే సినిమాకు ముందు తాను సినీ అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ కో ఆర్డినేటర్ ఫోన్ చేసి ఓ సినిమా అవకాశం ఉందని..కాకపోతే అంతకు ముందు బయటకు వెళ్లి కాస్త ఎంజాయ్ చేయాల్సిందిగా కోరాడని..అప్పుడే నీ ఫిగర్ గురుంచి ప్రొడ్యూసర్ కు వర్ణిస్తా. తద్వారా సినిమాలో అవకాశం వస్తుందని అతడి నాతో చెప్పినట్లు మాధవి లత తెలిపింది. 
Related image
మరో సందర్భంగా అనుకోకుండా ఓ రోజు నాకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే రాత్రికి ఫ్రీనా అని అడిగాడు. వెంటనే చెప్పు తీసుకుని కొడతా అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చా. కానీ ఆ మూర్ఖుడు మీకు ఇలాంటివి కొత్త కాదని..సినిమా చాన్స్ కోసం చాలా మంది ఇలా చేస్తారని అన్నాడని దాంతో నాకు చిర్రెత్తుకొచ్చి నీ నంబర్ తీసుకుని వెంటనే పోలీస్ కంప్లైన్ట్ చేస్తా అని చెప్పగానే ఫోన్ పెట్టేసాడని మాధవి తెలిపింది. 
Image result for actress madhavi latha hot
ఓ నిర్మాత ఫోన్ చేసి పరోక్షంగా కమిట్ మెంట్ ఇస్తావా అని అడిగాడు. తనకు ఇలాంటివి ఇష్టం ఉండదని చెప్పగా..ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే..ఇలాంటివి తప్పదు కదా అన్నారు. దాంతో నాకు మరోసారి కోపం వచ్చి ఫోన్ పెట్టేశానని అవేదన వ్యక్తం చేసింది మాధవీ లత.  ప్రస్తుతం ఆ నిర్మాతను నమ్ముకొని చాలా మంది ఉన్నారని..ఆ నిర్మాత పేరు చెప్పకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని మాధవి అన్నారు.
Image result for actress madhavi latha hot
ఇండస్ట్రీలో ఎక్కువశాతం ఇలాంటి వారే ఉన్నారు. కానీ అతడి పేరు మాత్రమే చెప్పడం వలన మిగిలిన వారు అతడిని నిందిస్తారు.  ఇండస్ట్రీలో హీరోయిన్లు శరీరాల్ని సమర్పించుకునే పద్దతి ఆగదని మాధవి అన్నారు. కొంతమంది విధిలేని పరిస్థితుల్లో ఆ పని చేస్తుంటే, మరికొంత మంది అమ్మాయిలు సినిమా అవకాశాల కోసం వారి శరీరాల్ని లంచంగా సమర్పించుకుంటున్నారని మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: