సమైఖ్య ఆంధ్రా ఉధ్యమం విషయంలో అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా కను సైగలో నడుచుకుంటూ పైకి లేని గాంభీర్యాన్ని పులుముకుని కోస్తా ప్రజలకు అన్యాయం జరుగ కూడదు అంటూ, భారీ స్టేట్ మెంట్స్ ఇస్తూ కోస్తా ప్రజలను మభ్య పెట్టడానికి హైదరాబాద్ విషయంలో రాజీలేదు అనే మాటలు వదులుతున్న చిరంజీవి మనసులో ఒక మాస్టర్ ప్లాన్ అప్పుడే రచించు కున్నాడని విశ్లేషకులు అంటున్నారు. రాబోతున్న ఎన్నికలలో ఎవరు వద్దన్నా కాదన్నా కోస్తా జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రచార సారధిగా చిరంజీవిని నిలపాలని ఇప్పటికే సోనియా మనసులో ఆలోచనలు ఉన్నాయని, ఒక వేళ సమైఖ్య ఉద్యమ నేపధ్యంలో కోస్తా ప్రజలు చిరంజీవి పై ద్వేషం పెంచుకుంటే తెలంగాణా రావడం వల్ల, తెలంగాణాలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు ఉంటాయి కాబట్టి,  కోస్తా జిల్లాలలో ప్రచారం చేసినా చిరంజీవి మాత్రం హైదరాబాద్ ప్రాంతం నుండి ఎదో ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఉద్దేశ్యంలో ఉంటూ తాను అందరి వాడిననీ నిరూపించు కోవడానికి మాస్టర్ ప్లాన్ వేస్తూ తన కుటుంబసభ్యుల ఆస్థులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరం విషయానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ మాట్లాడుతున్నాడనిఅంటున్నారు.

ఎటువంటి రాజకీయ పార్టీ మరే ప్రముఖ వ్యక్తి ప్రోద్బలం లేకుండా ప్రస్తుతం సమైఖ్య ఆంధ్రాలో నడుస్తున్న సమైఖ్య సెగలు శాస్వితంగా ఉండవని కొన్ని రోజులు మాత్రమే ఈ వాడి వేడి ఉంటుందని ఉహిస్తూన్న చిరంజీవి పైకి చిన్న చిన్న డైలాగులు సమైఖ్య ఆంధ్రకు అనుగుణంగా మాట్లాడుతూ అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలోని సికిందరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తే బాగుటుంది అనే మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడట మన మెగాస్టార్. అందుకే ఈ ఉద్యమ వేడి తగ్గే దాకా తన కుమారుడి సినిమాలు విషయంలో కూడా జాగ్రత్త పడుతూ తెలివిగా దసరాకు రామ్ చరణ్ సినిమాను జరిపించేసాడు అని అంటున్నారు. పైకి చెప్పకపోయినా చిరంజీవి రెండు పడవల సిద్దాంతం ఆయన కెరియర్ కు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: