అమాయక అందాల సుందరికి లావణ్య త్రిపాఠికి మంచి పేరే ఉంది. అమాయకంగా కనిపిస్తూనే లేలేత అందాల ఆరబోతకూ వెనుకాడకపోవడం ఆమె మైనస్ పాయింట్. గ్లామర్ యాంగిల్లో కాకుండా తనను తాను నిరూపించుకున్న అందాల రాక్షసి చిత్రం ఆమె కేరీర్ ఆరంభంలో దక్కడం ఆమెకు మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. చిన్న సినిమానే అయినా అది ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

Related image
ఆ తరవాత వచ్చి దూసుకెళ్తా సినిమా ఆమెకు కమర్షియల్ అనే ముద్ర తీసుకొచ్చి హెల్ప్ చేసింది. ఇక ఆమె నానీతో చేసిన భలే భలే మొగాడివోయ్.., సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు ఆమె కేరీర్ ను పీక్ లెవల్ కు తీసుకెళ్లి అగ్రహీరోయిన్ రేసులో నిలబెట్టాయి. అలాంటి హిట్లు మరో రెండు,మూడు పడుంటే రకుల్ ప్రీత్ సింగ్ వంటి భామకు గట్టి పోటీ ఇచ్చేదే..

Related image
కానీ.. మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాలు ఆమె కేరీర్ కు పలుకురాళ్లుగా మారాయి. వరుస ఫ్లాపులతో ఈ సన్న సుందరి ఇబ్బందుల్లోపడింది. తాజాగా వచ్చిన ఇంటలిజెంట్ ఆమెను మరీ డిజప్పాయింట్ కు గురి చేసింది. ఇలాంటి కష్టకాలంలో ఆమెకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది.

Related image
రాజాది గ్రేట్ వంటి సినిమాతో మరోసారి కెరీర్ లో దూసుకెళ్తున్న మాస్ మహరాజా పక్కన ఛాన్స్ కొట్టేసిందీ ముద్దుగుమ్మ.. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి అనుభవాన్నిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: