పెళ్లిచూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తర్వాత ద్వారక సినిమాలో నటించాడు.  ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు..ఇక సందీప్ వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించాడు.  మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రంగా నిలిచిన ఈ సినిమా ఒకదశలో రిలీజ్ చేయడానికి కూడా ఆపమని గోళ చేశారు.  మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ కావడం బ్లాక్ బస్టర్ సాధించడం..విపరీతమైన కలెక్షన్లు రాబట్టడం జరిగింది.  ఈ సినిమాతో అటు దర్శకుడికి..ఇటు హీరో, హీరోయిన్లకు మంచి క్రేజ్ వచ్చింది. 
Related image
ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు. విజయ్ సంకృత్యన్ దర్శకత్వంలో ‘టాక్సీవాలా’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రియాంకా జవాల్కర్, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్కేఎన్ నిర్మాత. ‘టాక్సీవాలా’ ఫస్ట్‌గేర్ పేరిట శుక్రవారం విజయ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
Image result for taxiwala
టీజర్ త్వరలోనే వస్తుంది’ అని యూవీ క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది.అంటే ‘టాక్సీవాలా’ సినిమా మే 18న విడుదలవుతుందని వచ్చిన వార్తలను యూవీ క్రియేషన్స్ ఖరారు చేస్తూ విజయ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఉంచింది. ఈ పోస్టర్‌లో విజయ్ లుక్ అదిరిపోయింది.. ఈ సినిమాలో విజయ్ టాక్సీ డ్రైవర్ శివ పాత్రలో కనిపించనున్నాడు.
Image result for taxiwala
ఇక ‘టాక్సీవాలా’లో కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. కాగా, టాక్సీవాలా’పై యూవీ క్రియేషన్స్ తాజాగా చేసిన ట్వీట్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ‘మా సాహో టీజర్ ఎప్పుడో చెప్పండి మహాప్రభో’ అంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి ‘సాహో’ ఎక్కడి వరకు వచ్చిందో.. టీజర్ ఎప్పుడు విడదలవుతుందో యూవీ క్రియేషన్సే చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: