టాలీవుడ్ లో రంగస్థలం ఫీవర్ పీక్స్ కి చేరింది. రిలీజ్ కి కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో మెగా అభిమానుల్లో  ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక రీసెంట్ గా వచ్చిన జిగేల్ రాణి సాంగ్ క్లాస్, మాస్ ఆడియన్స్ కి కిరాక్ పుట్టిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయ్. దీంతో కొత్త జోనర్ తో వస్తున్న రంగస్థలం మూవీ.. చెర్రిని 100 కోట్ల క్లబ్ లో చేర్చే మూవీగా ఫోకస్ చేయబోతోంది. ఇంతకీ ఈ సినిమా హైలైట్స్ ఏంటి..?

Image result for rangasthalam

టాలీవుడ్ లో రామ్ చరణ్ - సమంత లీడ్ రోల్స్ లో సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం. 1980 నాటి పల్లెటూరి అందాలను ప్రతిబింబించేలా తెరకెక్కిన ఈ మూవీ రేపు వ్యూయెర్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్  హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ప్రోమో కూడా అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఎంత సక్కంగున్నావే పాట ప్రోమో బయటకు రాగానే ఫరవాలేదన్నారు. రంగ.. రంగ.. రంగస్థలాన పాటకు ఓ లెవెల్ లో డ్యాన్స్ చేసిన ప్రోమో చూసి, చరణ్ డ్యాన్స్ లు అదరగొట్టేలాగే వున్నాయ్ అన్నారు.. లేటెస్ట్ గా జిగేల్ రాణి పాట బయటకు వచ్చేసరికి రామ్ చరణ్ చిందులు మెరుపుల్లా మారాయి అంటున్నారు. లుంగీ మీదకు కట్టి చెర్రి రెచ్చిపోయి చేసిన డ్యాన్స్ క్లాస్ మాస్ ఆడియన్స్ కి కిరాక్ పుట్టిస్తుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ పై ప్యాన్స్ లో అటెంక్షన్ ఫీక్స్ కి చేరింది.

Image result for rangasthalam

ఇలా సాంగ్స్... ట్రైలర్స్ తో రంగస్థలం చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా పెరిగిన అంచనాలకు ధీటుగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా దిమ్మతిరిగేలా జరిగినట్టు సమాచారం. రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 115 కోట్ల మేరకు జరిగినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రాంతాల వారీగా రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం సినిమా సుమారు 62 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. పక్క రాష్ట్రాలయిన కర్ణాటకలో 8 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో కలుపుకొని 2 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ లో 9 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయినట్టు సమాచారం.   శాటిలైట్ హక్కుల విషయంలో రంగస్థలం ఏమాత్రం తగ్గలేదు. తెలుగు శాటిలైట్ హక్కులు 20 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్లు, ఇతర హక్కులను 2 కోట్లకు అమ్మినట్టు సమాచారం. థియేట్రికల్ రైట్స్ 80 కోట్లతో కలిపి మొత్తం 112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు లెక్క తెలుస్తోంది.

Image result for rangasthalam

రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోవడంతో ఈ సినిమా రిజల్ట్ పై పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఈ సినిమాతో రామ్ చరణ్ ను 100 కోట్ల క్లబ్ లో చేర్చడం కన్ఫామ్ అనే టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ రోజు.. ఫస్ట్ షోకి పాజిటివ్ టాక్ సొంతం అయితే 120 నుంచి 150 కోట్ల వరకు వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తరువాత సరికొత్త జోనర్ తో కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రామ్ చరణ్ చేసిన ప్రయత్నం ఫలించేలా ఉంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చెర్రి కెరీర్ తిరిగి టాప్ పొజిషన్ కి చేరే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి: