మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సౌండ్ ఇంజ‌నీర్‌గా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి దిగాడు. చిట్టిబాబుగా రామ్‌చ‌ర‌ణ్‌, రామ‌ల‌క్ష్మిగా స‌మంత, సుకుమార్ క్రియేటివిటి క‌లిపి సినిమాకు మంచి హైప్ తెచ్చారు. సినిమా చూసిన జ‌నాలు రామ్‌చ‌ర‌ణ్ ప‌దేళ్ల కెరీర్‌లోనే ఈ సినిమాలో చిట్టిబాబు పెర్పామెన్స్ సూప‌ర్ అని విమ‌ర్శ‌కులు అంద‌రూ మెచ్చుకుంటున్నారు. చెర్రీని ఇప్ప‌టి వ‌ర‌కు పెర్పామెన్స్ ప‌రంగా విమ‌ర్శ‌లు చేసిన వారు ఈ సినిమా చూసి ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


రంగస్థలం అదిరిపోయింది.. చిట్టిబాబుకి వినపడేలా గట్టిగా అరచి చెప్పండి..!

ఇక సినిమా ర‌న్ టైం బాగా ఎక్కువైంద‌న్న విమ‌ర్శ మాత్రం ఎక్కువుగా ఉంది. ఓవ‌రాల్‌గా మాత్రం సినిమాకు పాజిటివ్ రిపోర్టులే వ‌స్తున్నాయి. ఇక తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి వ‌సూళ్లే రాబ‌ట్టే ఛాన్సులు ఉన్న‌ట్టు ట్రేడ్ రిపోర్టులు చెపుతున్నాయి. ఇక యూఎస్ ప్రీమియ‌ర్ల వ‌సూళ్ల‌లో చెర్రీ గ‌ట్టిగానే వ‌సూళ్ల కుమ్మేశాడు. గురువారం రాత్రి  అమెరికాలోని దాదాపు 142 సెంటర్లలో రంగస్థలం మూవీ ప్రీమియర్స్ వేశారు. కేవ‌లం ప్రీమియర్స్ కలెక్షన్లతోనే 6 లక్షల 20 వేల డాలర్లు కొల్లగొట్టిందీ చిత్రం.


రంగస్థలం అదిరిపోయింది.. చిట్టిబాబుకి వినపడేలా గట్టిగా అరచి చెప్పండి..!

ఇక ప్రీమియ‌ర్ల ద్వారా అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన తెలుగు సినిమాల జాబితాలో ఈ సినిమాకు ఆరో ప్లేస్ ద‌క్కింది. వాస్త‌వానికి చెర్రీకి ఓవ‌ర్సీస్ మార్కెట్ త‌క్కువే అయినా సుక్కుకు అక్క‌డ మంచి డిమాండ్ ఉంది. సుక్కు క్రేజ్ నేప‌థ్యంలో రంగ‌స్థ‌లం ప్రీమియ‌ర్ వ‌సూళ్ల‌కు బాగా క‌లిసొచ్చింది. బాహుబలి 2 - అజ్ఞాతవాసి - బాహుబలి 1 - ఖైదీ నెం. 150 - స్పైడర్ చిత్రాలు మాత్రమే రంగస్థలం కంటే ముందున్నాయి.  ఇక తొలి రోజే 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల క్ల‌బ్‌లోకి చెర్రీ ఎంట్రీ ఇస్తాడేమో ?  చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: