ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో  రాంచరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నిన్న విడుదలయిన చిత్రం రంగస్థలం. రాష్ట్రంలో మొదటి ప్రివ్యూ పడ్డాక మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా చివరికి బ్లాక్ బాస్టర్ అయింది. నటన పరంగా రాంచరణ్ ఈ సినిమాతో ఒక మెట్టు పైకి ఎదిగాడని అందరూ చరణ్ ని పొగుడుతున్నారు.


ఒక సినిమా హిట్టా, ఫట్టా అని నిర్ణయించేది కలెక్షన్లే. అయితే భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈ చిత్రం వసూళ్లపరంగా దూసుకుపోతుంది. ఇటు ఇండియాలో, అటు ఓవర్సీస్ కనకవర్షం కురిపిస్తుంది. అమెరికాలో కేవలం ప్రివ్యూల ద్వారా రూ.4.39 కోట్లను రాబట్టిన ఈ సినిమా శుక్రవారం నాటికి ఒక మిలియన్ అమెరికన్ డాలర్లను కొల్లగొట్టింది.


మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియాలో రంగస్థలం కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. నిన్న శుక్రవారం నాటికి రూ. 83.04 లక్షలను సాధించి తెలుగు సినిమాల మార్కెట్ పెరుగుతోంది అనే ఆశను, అభివృద్ధిని తెలిపింది. ఈ విషయాన్నే ప్ర‌ముఖ సినీ విమర్శకుడు మరియు ట్రేడ్ అన‌లిస్ట్ త‌రుణ్ ఆద‌ర్శ్ ట్విట్టర్లో ధృవీకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: