తమిళ హీరో ఇలయదళపతి విజయ్ నటించిన ‘మెర్సిల్’ తెలుగు లో ‘అదిరింది’ చిత్రం ఎన్నో వివాదాల మద్య రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన తర్వాత కూడా రాజకీయ కోణంలో ఈ చిత్రంపై విమర్శలు వచ్చాయి. ఇక తమిళనాడులో వైద్యులు తమను కించపరిచారంటూ నిరసనలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు.  మొత్తానికి ఈ సినిమా థియేటర్లో బీభత్సమైన సందడి చేసింది. కనీ వినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించింది.  తెలుగు లో పెద్దగా విజయం సాధించకున్నా పరవాలేదు అనిపించకుంది.
Image result for mersals
ఇప్పటికే ఎన్నో బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం తాజాగా... ప్రతిష్ట్మాత్మక 'యూకే నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు' వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో మొత్తం 8 చిత్రాలు పోటీపడగా... జ్యూరీ 'మెర్సల్‌' వైపే మొగ్గు చూపింది. ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డు రావడం పట్ల చిత్రబృందం సంతోషంలో మునిగి తేలుతుంది.
Image result for mersals
ఉత్తమ సహాయ నటుడు విభాగంలో... విజయ్ పోటీ పడ్డప్పటికీ... బ్యాక్ సినిమాకు గాను రాబర్ట్ వెబ్‌ను ఆ అవార్డు వరించింది.  ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత, కాజల్, నిత్యా మీనన్ హీరోయిన్లు గా నటించారు.  ప్రముఖ నటులు సత్యరాజ్, ఎస్.జె. సూర్య సహాయ పాత్రల్లో నటించారు.

జీఎస్టీ, డాక్టర్లకు సంబంధించి... వివాదాస్పద అంశాలు డైలాగులు ఉన్నాయని... అప్పట్లో ఈ సినిమాపై నిరసనలు వ్యక్తమైన వివాదాల మద్య రిలీజ్ అయినా మంచి రిజల్ట్ సాధించింది. ట్విస్ట్ ఏంటంటే..సెన్సార్ సభ్యులు... మాత్రం ఎలాంటి కట్ లేకుండా సినిమాకు ఓకే చెప్పడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: