కాస్ట్ కౌచింగ్ గురించి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటర్నెట్ ప్రముఖ చానల్స్ లో రచ్చ రచ్చ చేస్తున్న నటి శ్రీ రెడ్డి. పడుకుంటే కానీ ఇండస్ట్రీలో ఛాన్స్ రాదని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని తెర వెనక బాగోతాలు బయటపెట్టేందుకు ఉద్యమం చేపట్టిన ఈ అమ్మడు దీనికి 'శ్రీ రెడ్డి లీక్స్' అని పేరు పెట్టింది.
Image result for శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచింగ్
ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే కచ్చితంగా దర్శకులను మిగతా టెక్నీషియన్లను అందరూ హీరోయిన్లను బెదిరించడం..వేధించడం జరుగుతుందని అన్నారు.  తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డితో భేటీ అయి ఇందుకు సంబంధించిన అంశాలపై చిట్ చాట్ చేశారు.  ఈ సమయంలో వీరిద్దరి మద్య వాగ్వీవాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. 
పెద్ద వారు కూడా ఇందులో ఉన్నారు
ఈ సందర్భంగా  శ్రీరెడ్డికి తమ్మారెడ్డి కొన్ని ప్రశ్నలు సందించారు.  అలాంటి ఇబ్బందులు పడ్డ మీరు ఎందుకు అప్పుడే బయటకు రాలేదు..అన్నారు.  దీనికి శ్రీరెడ్డి స్పందించి..కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్న పలువురు నటీమణులు ఆ విషయం బయట పెట్టకపోవడానికి కారణం భయమే. అతడు ప్రాబ్లం చేశాడని చెప్పి కంప్లయింట్ చేస్తే నెక్ట్స్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ అమ్మాయి ఏదో తలనొప్పులు పెడుతోంది అని అవకాశాలు ఇవ్వడం లేదు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు.
Image result for శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచింగ్
ఒక అమ్మాయి హీరోయిన్ గా ట్రై చేస్తుంటే...ఆ అమ్మాయి ఫోటో పట్టుకొని కోఆర్టినేటర్లు..మేనేజర్లు ఇలా కొంత మంది తిప్పి తిప్పి సుమారు ఐభై వేలు ఆ అమ్మాయికి ఖర్చు అయ్యే వరకు చేస్తారని..చివరికి మీరు కమిట్ మెంట్ ఇస్తే పని అవుతుందని చెప్పడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మాయిలే నీరుగారిపోతారని ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. 

దానికి సంబంధించిన సమాచారం మేము గ్యాదర్ చేశాం. కచ్చితంగా వాటిని త్వరలో బయట పెడతాం అని శ్రీరెడ్డి వెల్లడించారు. హీరోయిన్ గా నటించడానికి వెళ్లినవారికి కొందరు డైరెక్టర్లు అసలు రెస్పెక్ట్ ఇవ్వరు. అమ్మాయిల ముందు కాస్త గౌరవంగా మాట్లాడి..వారు వెళ్లిన త్వరాత అమ్మాయి గురించి నీచంగా చర్చించుకోవడం వీరికి కామన్ అయ్యింది. 
రైడ్స్ చేస్తే చాలా మంది బడాబాబులు దొరుకుతారు
ఇక ఇలాంటి డైరెక్టర్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా తర్వాత స్టేజ్ లో ఇలాగే మారిపోతున్నారని అన్నారు.  ప్రస్తుతం ఉన్న సిస్టం ఏదైతే ఉందో అది మారాలి. తెలుగు అమ్మాయిలను తప్పకుండా తీసుకోవాలనే రూల్స్ పెట్టాలి. ఇందుకోసం నేను పోరాడుతున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరిట ఫ్రీగా భూములు దొబ్బి స్టూడియోలు కట్టించుకున్నారు. కళా రంగానికి సేవ చేస్తామని కోట్ల రూపాయల విలువ చేసే భూములు తీసుకుని శృంగారానికి ఎలా వాడుకుంటారు? అవేమైనా బ్రోతల్ హౌసులా? స్టూడియోలా? అంటూ శ్రీరెడ్డి వాదనకు దిగారు.
Image result for sri reddy
తమ్మారెడ్డి వెంటనే స్పందిస్తూ బ్రోతల్ హౌస్ అనే పదం చాలా పెద్ద పదం అంటూ ఆమె వాదనను ఖండించే ప్రయత్నం చేశారు. లాడ్జిల్లో 500, 200లకు వెళ్లే చిన్న చిన్న వారిని పట్టుకుని ఏదో పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్లు చేశామని చెప్పడం కాదు.  ఇలా చేస్తే ఎంతో మంది బ్రోకర్లు..సినీమా ఇండస్ట్రీ దొంగలు బయట పడతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: