శ్రీరెడ్డి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా మాట్లాడి ఇండస్ట్రీలో అలాంటి వెధవల బండారాన్ని బయటపెడ్తానని సవాల్ చేసిందీ భామ. అన్నట్టుగానే ఒక్కొక్కరి గురించి సోషల్ మీడియాలో ఆటాడుకుంటోంది.

Image result for sri reddy

          తాజాగా శేఖర్ కమ్ములను ఉద్దేశించినట్టుగా ఓ పోస్టును ఫేస్ బుక్ లో పెట్టింది. దీనిపై సీరియస్ గా స్పందించిన శేఖర్ కమ్ముల, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీనిపై శ్రీరెడ్డి కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయింది. తానెక్కడా అతని పేరు ప్రస్తావించలేదని, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఏం చేసుకుంటావో చేసుకో.. అన్నట్టు కౌంటర్ ఇచ్చింది.

Image result for sri reddy

          శేఖర్ కమ్ముల ఇష్యూ అలా అవగానే బిత్తిరి సత్తి ప్రోగ్రామ్ యాంకర్ సావిత్రిని ఉద్దేశించినట్టుగా ఓ పోస్టు పెట్టింది. తన కులాన్ని ప్రస్తావిస్తూ ఏవో కామెంట్స్ చేసింది. ఓ కులానికి చెందిన నువ్వు ఇంకో కులం వ్యక్తిగా చెప్పుకునేందుకు తహతహలాడుతున్నావని ఆరోపించింది. ఇండస్ట్రీలో ఇప్పటికే శ్రీరెడ్డి ఏం బయటపెడుతుందోనని పలువురు కంగారు పడుతుంటే తాజాగా బుల్లితెర వాళ్లపైనా శ్రీరెడ్డి కామెంట్ చేయడం సంచలనం కలిగిస్తోంది.

Image result for sri reddy

          మున్ముందు మరింత మంది జాతకాలను కూడా బయటపెడ్తానంటోంది శ్రీరెడ్డి. తనతో కొంతమంది ప్రముఖులు సెక్స్ చేశారని ఇప్పటికే బయటపెట్టింది. అందులో ముగ్గురు ప్రముఖ డైరెక్టర్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. వారితో సెక్స్ లో పాల్గొన్న వీడియోలు కూడా శ్రీరెడ్డి దగ్గర ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.

Image result for sri reddy

          శ్రీరెడ్డి బిహేవియర్ ను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సినిమా పెద్దలు కూడా తలలు పట్టుకుంటున్నారు. నేరుగా కంప్లేయింట్ చేసేందుకు చట్టపరంగా వీలు కావట్లేదు. అదే సమయంలో కామ్ గా వదిలేస్తే ఎప్పుడు ఎవరి మీద బాంబు పడుతుందో తెలియదు. అందుకే ‘మధ్యేమార్గం’ ఆలోచించాలని సినిమా పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: