మహేష్ , ప్రీ క్లైమాక్స్ సీన్స్ , డైలాగ్స్ , స్క్రీన్ ప్లే , సినిమాటోగ్రఫీమహేష్ , ప్రీ క్లైమాక్స్ సీన్స్ , డైలాగ్స్ , స్క్రీన్ ప్లే , సినిమాటోగ్రఫీలీడ్ పెయిర్ రొమాన్స్ లేకపోవడం, నిడివి
ఆక్స్ ఫర్డ్ లో డిగ్రీ అందుకున్న వెంటనే భరత్ రామ్ (మహేష్) తన తండ్రి మరణించాడని వార్త తెలుసుకుంటాడు. ఆయన కోసం ఇండియా వచ్చిన భరత్ తండ్రి వదిలిన సిఎం సీటు వరిస్తుంది. తండ్రి స్నేహితుడు వరదరాజు (ప్రకాశ్ రాజ్) భరత్ ను సిఎం చేస్తాడు. అక్కడి నుండి భరత్ ఎలా తన పవర్ తో రాజకీయ పరిస్థితులను, ప్రజలను చక్కబెట్టాడో అదే సినిమా కథ.

సినిమా ఏదైనా మహేష్ హీరోగా అంటే అందులో పాత్ర తప్ప మరొకటి కనబడదు. అలానే భరత్ అనే నేను సినిమాలో మహేష్ నటన కూడా అంతే. అద్భుతంగా తన నటనతో ఆకట్టుకున్నాడు. వన్ మ్యాన్ షోతో ఉత్సాహపరచాడు. హీరోయిన్ కైరా అద్వాని కూడా బాగానే నటించింది. సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్ లు బాగా చేశారు. చిన్న పాత్రల్లో కూడా బాగా నటించి మెప్పించారు కొందరు నటీనటులు.

తిరు, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో మహేష్ ను చాలా అందంగా చూపించారు. కొన్ని సీన్స్ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. ఇక దేవి మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. భరత్ అనే నేను టైటిల్ సాంగ్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు. కథ, కథనాల్లో దర్శకుడు కొరటాల శివ చాలా మంచి ప్రతిభ కనబరిచాడు. కాన్సెప్ట్ మూవీ కమర్షియల్ హంగులను అద్ది చూపించిన తీరు అద్భుతం. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

బాధ్యతాయుతమైన సిఎం సమాజాన్ని ఎలా దారిలో పెట్టాడు అన్న కథతో వచ్చిన సినిమా భరత్ అనే నేను. మొదటి భాగం అలా అలా నడిపించగా సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ తో రాసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ప్రెస్ మీట్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.

మహేష్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు, ప్రెస్ మీట్ లో చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉన్నాయి. సినిమా ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా బాగా తీసుకొచ్చాడు కొరటాల శివ. శ్రీమంతుడు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది.

ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. ఓ మంచి కంటెంట్ ను కరెక్ట్ స్క్రీన్ ప్లేతో తీసుకొచ్చిన కొరటాల శివ మంచి ఫలితాన్నే అందుకుంటాడని చెప్పొచ్చు.
Mahesh Babu,Kiara Advani,Koratala Siva,D.V.V. Danayya,Devi Sri Prasadభరత్ అనే నేను.. సిఎం మహేష్ మనసులు గెలిచాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: