ఇప్పుడు టాలీవుడ్ మొత్తం నాని పేరే జపిస్తోంది. నాని పట్టిందల్లా బంగారమే. అందుకే నానితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఎలాంటి సినిమా అయినా ఈజీగా చేసేస్తున్న నాని... ఈ సమ్మర్ కి కృష్ణార్జున యుద్ధంతో ముందుకొస్తున్నాడు. డ్యూయెల్ రోల్ తో సందడి చేయబోతున్నాడు. 

Image result for NANI

ఈగ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నాని ఆ తర్వాత చేసిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందుకే ఇప్పుడు నాని నిర్మాతల ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఈ సమ్మర్ కి కృష్ణార్జునయుద్ధం చేయబోతున్నాడు. టీజర్ ఇప్పటికే సందడి చేస్తోంది. రాయలసీమ యాసలో ఉన్న జానపదం కుర్రకారును చిందులేయిస్తోంది. ఇక నాని యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముంటుంది.

Image result for NANI KRISHNARJUNA YUDDHAM

ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం రిలీజవుతోంది. ఈ సినిమా రిజల్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాని. మేర్లపాక మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది సినిమా టీం. దీని తర్వాత నాగార్జునతో కలిసి ఓ మూవీ చేయబోతున్నాడు ఈ నేచురల్ స్టార్. మరి కృష్ణార్జున యుద్ధం ఏం చేస్తుందో చూద్దాం .!


మరింత సమాచారం తెలుసుకోండి: