నటి శ్రీరెడ్డి పోరాటం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటూ ప్రస్తుతం మన ఇరు రాష్ట్రాలలోను హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ ఛానల్స్ అన్నీ ఆమె సమస్యలకు సంబంధించిన ఇంటర్వ్యూలతో గంటలగంటలు ప్రసారాలు చేస్తున్నారు అంటే శ్రీ రెడ్డి సమస్య తెలుగుప్రజల మధ్య ఎంతగా చొచ్చుకుపోయిందో అర్ధం అవుతుంది. 
వాళ్ళ ఇళ్లలో పుట్టలేదు
ఈమె పోరాటానికి ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న సపోర్ట్ కంటే మహిళా సంఘాల నుండి వస్తున్న మద్దతుతో ఆమెను రియల్ హీరోయిన్ గా మార్చివేసింది. నిన్న శ్రీ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థుల మద్దత్తు కూడగట్టుకుంది. ఆ సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
చాలా మంది ఉన్నారు
తాను తెలంగాణ ప్రాంతంలో పుట్టకపోయినా తెలంగాణ ప్రాంత విద్యార్ధులు మహిళా సంఘాలు తన సమస్య పై స్పందిస్తూ ఉంటే ప్రజల కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తన సమస్య పై ఎందుకు స్పందించడం లేదు అంటూ ఏకంగా పవన్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు కురిపిస్తోంది.  గత కొంతకాలంగా శ్రీ రెడ్డి తెలుగు అమ్మాయిలకు సినిమాలలో ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు అని అడుగుతున్న ప్రశ్నలకు ఇండస్ట్రీలోని టాప్ డైరక్టర్స్ కాని నిర్మాతలు కానీ స్పందించకుండా ఆమె పై ఎదురు దాడిని మరింత వేగవంతం చేసారు.  
గత కొన్ని రోజులుగా
ఇదే సందర్భంలో శ్రీ రెడ్డి పవన్ ను ఉద్దేసించి మాట్లాడుతూ ప్రజా సమస్యలు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యల గురించి పవన్ ఎందుకు మాట్లాడడు అంటూ ‘పవన్ కళ్యాణ్ అన్నా మీరు మాట్లాడాలి’ అంటూ అభ్యర్దిస్తోంది. శ్రీ రెడ్డి లేవనెత్తుతున్న ప్రశ్నలలో లాజిక్ ఉన్నా ఆ ప్రశ్నలకు ఆమెకు మద్దతు పలుకుతూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న వారి సంఖ్య చాల తక్కువగా ఉండటంతో భవిష్యత్ లో ఈమె చేసే పోరాటం కేవలం మీడియాకు హాట్ న్యూస్ గా మారిపోయి కొన్నాళ్ళకు చరిత్రలో కలిసిపోతుందా లేదంటే ఆమె చేస్తున్న ఈపోరాతానికి మద్దతు పెరుగుతుందా అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: