తెలుగు ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని.. తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వకుండా , వాడుకుని వదిలేస్తున్నారని గత నెల రోజులుగా నటి శ్రీ రెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే. రోజుకో లీక్‌తో టాలీవుడ్ ‘కాస్టింగ్ కౌచ్’ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు హల్‌చల్ చేస్తున్నాయి. 
Image result for sri reddy casting couch
ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీలో చాన్స్ ఇవ్వలని కోరితే..మొదట వారితో శృంగారానికే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారని..అలా చేసినా కొంత మంది అమ్మాయిలను దారుణంగా మోసం చేస్తూ..బయటకు గెంటేస్తున్నారని శ్రీరెడ్డి పలు ఛానల్స్ సాక్షిగా తన గోడు వెల్లబోసుకుంది.   ఇటీవలే ఆమె ‘మా’ ఛాంబర్ వద్ద అర్ధ నగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపిన విషయం తెల్సిందే.
Image result for sri reddy casting couch
దీంతో జాతీయ మీడియా లో సైతం శ్రీ రెడ్డి హాట్ టాపిక్ అయ్యింది.  దీంతో ఆమెపై ‘మా’ అసిసోయేషన్ సీరియస్ అయ్యింది.  శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీ పరువు తీసిందని..ఆమెతో ఎవరూ సినిమా తీయరని..నటించరని ఆమెపై బ్యాన్ విధించింది. దీంతో  శ్రీరెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కి పిర్యాదు చేసింది. శ్రీరెడ్డి ఆరోపణలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది.
Image result for sri reddy crying
తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై… తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇష్యూ చేసింది. సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం… శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది. దీంతో శ్రీ రెడ్డి పోరాటం లో మొదటి విజయం సాధించినట్లే అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డికి అన్ని వైపుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: