దిగాలుపడి ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి తన కలక్షన్స్ ప్రభంజనంతో షాక్ ఇచ్చిన ‘రంగస్థలం’ రికార్డులను హైలెట్ చేస్తూ నిన్నమీడియాకు ఈసినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ పై ప్రభాస్ అభిమానులు సెటైర్లు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడుదలై రెండువారాలు దాటిపోయినా కలక్షన్స్ సునామీ సృష్టిస్తూ ‘రంగస్థలం’ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టి దూసుకుపోతోంది. 
సంబంధిత చిత్రం
ఈపరిస్థుతుల నేపధ్యంలో ‘రంగస్థలం’ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా అభివర్ణిస్తూ ఈమూవీ 175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిది అంటూ తెలుగు సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అని చెపుతూ నిన్న అన్ని ప్రముఖ పత్రికలలో అత్యంత భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇక్కడే చిన్న సమస్య వచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ ‘బాహుబలి’ ఉండగా ‘రంగస్థలం’ బిగ్గెస్ట్ హిట్ ఎలా అవుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు ఈ ప్రకటన పై సెటైర్లు వేస్తున్నారు. 
RANGASTHALAM MOVIE LATEST POSTERS కోసం చిత్ర ఫలితం
అయితే ఈ ప్రకటనలో ఎక్కడో కనిపించీ కనిపించకుండా చిన్న అక్షరాల్లో డిస్క్లైమర్ వేశారు. అయితే ఈ అక్షరాలు మరీ చిన్నవి అయిపోవడంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను ‘రంగస్థలం’ బ్రేక్ చేసింది అన్న అక్షరాలూ మాత్రమే చాల పెద్దవిగా కనిపిస్తున్నాయి. 
PRABHAS LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో అసహనానికి లోనవుతున్న ప్రభాస్ అభిమానులు ‘రంగస్థలం’ సాధించిన విజయం గురించి అందరూ గొప్పగా పొగుడుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల చరణ్ కు కలిసి వచ్చేది ఏమిటి అంటూ కొందరు ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘బాహుబలి’ ఉండగా ‘రంగస్థలం’ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఎలా అవుతుంది అంటూ చేస్తున్న కామెంట్స్ చాలామంది దృష్టికి వస్తున్నాయి. రికార్డులు ఏమైనప్పటికీ ‘రంగస్థలం’ సాధించిన విజయం స్థాయిలో మరో టాప్ హీరో సినిమా వచ్చే వరకు ‘రంగస్థలం’ మ్యానియా కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం..  


మరింత సమాచారం తెలుసుకోండి: