టాలీవుడ్ లో ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.  శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతు పెరిగిపోయింది.  జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాన్ పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలు పెను సంచలనాలకు దారి తీసింది. దాంతో శ్రీరెడ్డికి ఇస్తున్న మద్దతు కొంత మంది ఉపసంహరించుకున్నారు..ఇక పవన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేధికగా నానా బూతులు తిడుతున్నారు. దాంతో రెండు రోజులుగా శ్రీరెడ్డి సైలెన్స్ గా ఉంది..కాగా నేటి ఉదయం నుంచి తన ఫేస్ బుక్ లో మళ్లీ సంచలన కామెంట్స్ పెట్టింది.  తనను విమర్శిస్తున్న మహిళా నటులపై విరుచుకుపడింది.
Image result for actress gayatri
ఈ ఉదయం నుంచి తన ఫేస్ బుక్ ఖాతాలో పలు పోస్టులను పెట్టిన ఆమె, గాయత్రి, రాధ, కల్యాణిల పేర్లు చెబుతూ వారందరి బాగోతాలు తన వద్ద ఉన్నాయని..తనపై విమర్శలు చేస్తున్న ఎవ్వరినీ వదిలే సమస్యే లేదని పోస్ట్ చేసింది.  ఈ సందర్భంగా నాకు గాయత్రి గత జీవితం గురించి తెలుసు. ఆమె ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకుంది? పెళ్లయిందా? కాలేదా? బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరు? అన్న విషయాలు నాకు తెలుసు. కాకపోతే తనకు అమ్మాయిలంటే చాలా గౌరవం ఉంది కనుకనే ఆమె గురించి ఎక్కువగా చెప్పలేదు..ఇక రాధ... మా టీవీలో ఆ అమ్మాయిని పీకేసి నన్ను 'పాతాళ భైరవి' ప్రోగ్రామ్ లో పెట్టారు. దానిపై ఇంత ఆగ్రహంతో ఉందని అనుకోలేదు" అని ఉదయం 9 గంటల సమయంలో ఓ పోస్టు పెట్టింది. 
Image result for karate kalyani
అయితే తనపై కరాటే కళ్యాణి చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం ఇచ్చింది.  "కల్యాణి లైఫ్ హిస్టరీలో ఎన్ని పోలీసు కేసులు, కోర్టు కేసులు ఉన్నాయి. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంది. దేవుడు లక్కీగా పిల్లలను ఇవ్వలేదు. ఉండుంటే పాపం వాళ్లను తన్నేసేది. 2011 యూఎస్ లో ఏం జరిగిందో అందరూ చెప్పారు. ఈవిడ పెట్టే టార్చర్ గురించి మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు వింటే షాక్ అవుతారని ఫేస్ బుక్ లో పెట్టింది.   నేను ఇక మాట్లాడను  నన్ను మానసికంగా హింసించే హక్కు, నన్ను విమర్శించే హక్కు, అబద్ధాలతో ప్రచారం చేసే హక్కు మీకు లేదు.
Image result for pawan kalyan
ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నారు. మీకు లీగల్ ఫైట్ తప్పదు. కబడ్దార్ కల్యాణి, గాయత్రి... మరికొన్ని పేర్లు త్వరలో వస్తాయి  అని చెప్పింది.ఈరోజు వరకూ నన్ను ఇరిటేట్ చేసిన వారిపై మాత్రమే నేను నిందారోపణ చేశా. అనవసరంగా నా వ్యక్తిగత జీవితం మీద ఎవరు మాట్లాడినా తాట తీస్తా..తరువాత కేసులు పెట్టిన తరువాత వేధిస్తే ఉపయోగం లేదు. పవన్ వ్యవహారం వేరే. నేను ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. క్షమాపణలు కూడా కోరాను" అని మరో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.



మరింత సమాచారం తెలుసుకోండి: