ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పెను వివాదాలు చెలరేగుతున్నాయి.  ఇంబస్ట్రీలో కామంతో కొంత మంది రాబంధులు ఛాన్స్ ల కోసం వెళ్లే అమ్మాయిలను శారీరకంగా..మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ఈ విషయం ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా..నటి శ్రీరెడ్డి తెరపైకి చాలా సీరియస్ గా తీసుకు వచ్చింది. దాంతో ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు..కొంత మంది నటీమణులు, సింగర్స్, సైడ్ యాక్టర్స్ కూడా గతంలో తమకు జరిగిన అన్యాయాలను చెబుతున్నారు.
Image result for SRI REDDY
మొన్న‌టి వ‌రుకు డ్ర‌గ్స్ కేస్‌లో ఉన్న టాలీవుడ్ ప్ర‌స్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొటుంది. ఇప్పటి వరకు నటీమణులకే అనుకున్నా..ఈ కాస్టింగ్ కౌచ్ సింగర్స్ కూడా ఎదురైందట. ఇండస్ట్రీలో స్టార్ సింగర్లు గా ఎదగాలని వచ్చేవారికి కొంత మంది దళాలరులు లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారని..అలాంటి వారిని ఎదిరిస్తే..ఏలాగో అలా ఛాన్స్ లు లేకుండా చేస్తారని సింగర్ గీతామాధురి ఆవేదన వ్యక్తం చేసింది. 
Image result for GEETA MADHURI
ప్రస్తుతం ఇండస్ట్రీలో సింగర్ గా తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న సింగర్ గీతామాధురి. మొదట్లో తెలుగు సినీపరిశ్రమలో నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి సంతోషపడ్డా. ఆ తరువాత చాలా ఇబ్బందులకు గురయ్యా. అదే అవకాశాలు కావాలంటే దర్శకులు, నిర్మాతలు రమ్మని పిలవడం సర్వసాధారణం అయ్యాయని..లొంగని వారికి వారు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదని వాపోయింది.
Related image
గతంలో ఇలాంటి ఇబ్బందులు నా పట్ల కూడా జరిగాయని..కానీ నేను దేనికీ లొంగలేదని అన్నారు గీతామాధురి. సింగర్ కూడా ఇలాంటివి ఉంటాయని అనుకోలేదని బాధపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: