తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు హిట్ నుంచి దువ్వాడ జగన్నాధమ్’ వరకు మంచి విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు.  ప్రస్తుతం వక్కంతం వంశి దర్శకత్వంలో ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా ఇప్పటికే రావాల్సి ఉన్నా చరణ్ నటించిన ‘రంగస్థలం’, మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ లాంటి పెద్ద సినిమాలు ఉండటంతో రిలీజ్ ని ఆపినట్లు సమాచారం. 
Image result for na peru surya
ఇక వేసవి సెలవుల్లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో బన్ని చిత్రానికి కాంపిటీషన్ ఉండదన్న అంటున్నారు.  ఇక సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో షేక్ అయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రంగస్థలం సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చింది. ఇక భరత్ అనే నేను సినిమా టాక్ ఎలా ఉన్నా ఆ కలెక్షన్స్ ఊపు కొనసాగిస్తోంది. ఇప్పుడిక స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సత్తా చూపించడానికి బాక్స్  ని షేక్ చేస్తారని అంటున్నారు సినీ అభిమానులు.
Image result for na peru surya
సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు యూ బై ఎ సర్టిఫిక్ ఇచ్చారు. హింసాత్మక దృశ్యాలు ఉన్నాయని యూ బై ఎ ఇచ్చారు. యాటిట్యూడ్ ఉన్న యాంగ్రీ యంగ్ మేన్‌గా బన్నీ నటన హైలైట్ అని సెన్సార్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ కథలో బన్నీ యాక్షన్ ఎపిసోడ్స్ మెస్మరైజ్ చేయడం ఖాయం అట. అలాగే సరైనోడు సినిమాలో కంటే ఇంకా ఎక్కువగా బన్నీ బాడీ ప్రొజెక్ట్ చేశారు అని తెలుస్తోంది.
Image result for na peru surya
కామెడీ పాళ్ళు తక్కువే ఉన్నప్పటికీ చివరి ఉత్కంఠ, ఉద్విగ్న క్షణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. అన్నింటికీ మించి తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ సూపర్ హైలైట్ అవుతుందని సెన్సార్ మెంబర్స్ చెప్పారు. చిత్రం రన్ టైం 2 గంటలా 47 నిమిషాలుగా ఫిక్స్ చేశాడు. అర్జున్ రెడ్డి, రంగస్థం, భరత్ అనే నేను చిత్రాల్లాగే నా పేరు సూర్య కూడా దాదాపు మూడు గంటల నిడివితో రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: