మంచు విష్ణు, బ్రహ్మి కొద్ది కామెడీ, ప్రగ్యా జైశ్వాల్మంచు విష్ణు, బ్రహ్మి కొద్ది కామెడీ, ప్రగ్యా జైశ్వాల్కథ, కథనం, డైరక్షన్
అప్పలాచార్య (బ్రహ్మానందం), కృష్ణమాచార్య (మంచు విష్ణు) గురు శిష్యులు. ఓ హోమం వల్ల వారు ఇబ్బందుల్లో పడతారు. ఇంతలోనే రేణుక (ప్రగ్యా జైశ్వాల్)ను చూసి ఇష్టపడతాడు కృష్ణమాచార్య. హోమం వల్ల జరిగిన సంఘటనలలో వీరు ఇబ్బందుల్లో పడతారు. దాని కోసం అర్చక బృందం మొత్తం అమెరికా బాట పడతారు. ఇంతకీ కృష్ణామాచర్య అమెరికాకు ఎందుకు వెళ్లాడు..? అక్కడకు వెళ్లాక ఏం జరిగింది..? రేణుక కృష్ణమాచార్య ప్రేమను అంగీకరించిందా లేదా అన్నది సినిమా కథ.
మంచు విష్ణు తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే దర్శకుడు హీరో పాత్ర విధివిధానాలను ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఎప్పటిలానే ఆకట్టుకుంది. అక్కడక్కడ గ్లామర్ లుక్ లో ఇంప్రెస్ చేసింది. బ్రహ్మానందం ఎప్పటిలానే కామెడీతో అలరించాడు. ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్ విలనిజం పర్వాలేదు అనిపిస్తుంది. ప్రవీణ్, పృధ్వి, ప్రభాస్ శ్రీను, పోసాని పాత్రలని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు.

సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పొచ్చు. అమెరికాలో ఇండియాలో కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది. తమన్ మ్యూజిక్ కాస్త పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ షో కూడా బాగుంది. దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి ఎలాంటి లాజిక్ లేని కథ, కథనాలతో ఏమాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగులు కూడా మరి రొటీన్ గా అనిపిస్తాయి.

కామెడీ మీద మంచి పట్టున్న నాగేశ్వర్ రెడ్డి మంచు విష్ణుతో ఆడోరకం ఈడోరకం సినిమా తీసి హిట్ అందుకున్నారు. అదే క్రేజ్ తో వచ్చిన ఆచారి అమెరికా యాత్ర ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా అంతా రొటీన్ పంథాలోనే సాగుతుంది. ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనాలతో వచ్చింది ఈ సినిమా.

మొదటి భాగం కాస్త ఎంటర్టైన్ చేసినా సెకండ్ హాఫ్ సీరియస్ మోడ్ లో వెళ్లడం అది కూడా రొటీన్ గా నడిపించడం ఏమాత్రం బాగాలేదు. ఇక సినిమా క్లైమాక్స్ లో అయినా కాపాడుతుందేమో అంటే రొటీన్ క్లైమాక్స్ అనిపిస్తుంది. చారి పాత్రలో మంచు విష్ణు, బ్రహ్మానందం కొద్దిపాటి కామెడీ చేసినా అది సినిమాను నిలబెట్టేలా లేదు.

ఫైనల్ గా కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ఆచారి అమెరికా యాత్ర. ఏమాత్రం లాజిల్ లేకుండా, రొటీన్ కథ కథనాలతో, డైలాగ్స్ కూడా ఆకట్టుకోని విధంగా వచ్చింది.
Vishnu Manchu,Pragya Jaiswal,G. Nageswara Reddy,Kirthi Chowdary,Kittu,SS Thamanఆచారి అమెరికా యాత్ర.. నిరాశ పరచిన విష్ణు ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: