‘భరత్ అనే నేను’ కలక్షన్స్ రికార్డులను మోగిస్తున్న నేపధ్యంలో ఈసినిమాను మరింత ప్రమోట్ చేయడానికి మహేష్ చేస్తున్న ప్రయత్నాలకు మంత్రి కెటిఆర్ తన వంతు సహకారం ఇస్తూ మహేష్ కొరటాలలతో కలిసి పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని నిన్న టివి9 ఛానల్ ప్రైమ్ టైమ్ కార్యక్రమంలో ప్రసారం చేసింది. అనేకమంది జర్నలిజం సోషల్ సైన్సెస్ విద్యార్ధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విధ్యార్ధులు అనేక ఆలోచనాత్మకమైన ప్రశ్నలను మహేష్ ను కెటిఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. 
MINISTER KTR ALONG WITH MAHESH AND KORATALATV 9 DISCUSSION PROGRAMME PHOTOS కోసం చిత్ర ఫలితం
నేటి సామాజిక రాజకీయ వ్యవస్థలోని లోపాల దగ్గర నుంచి సమాజంలో రావలసిన మార్పుల వరకు యూత్ అడిగిన అనేక ప్రశ్నలకు కెటిఆర్ మహేష్ కొరటాలలు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్న నేపధ్యంలో మంత్రి కెటిఆర్ ను మహేష్ తరుచు ‘సర్’ మరియు ‘అన్న’ అంటూ గౌరవంగా సంభోదించడంతో మహేష్ వంక చూసి నవ్వుతూ తాను మహేష్ కన్నా వయస్సులో చిన్నవాడిని అని అర్ధం వచ్చేలా జోక్ చేస్తూ ‘బయటకు అందంగా తక్కువ వయస్సులో ఉన్నట్లు కనిపిస్తున్నావు కాని నువ్వు చిన్నవాడివి కావు, నీ అసలు వయస్సు చెప్పనా ?’ అంటూ జోక్ చేసేసరికి ‘ఆ పని మాత్రం చేయవద్దు మీకు దణ్ణం పెడతాను’ అంటూ మహేష్ తన వయస్సుకు సంబంధించిన ప్రస్తావన చాల జాగ్రత్తగా దాటించివేసాడు. 
MINISTER KTR ALONG WITH MAHESH AND KORATALATV 9 DISCUSSION PROGRAMME PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇదే సందర్భంలో మంత్రి కెటిఆర్ తరుచు మహేష్ ను ‘నువ్వు’ అని సంభోదిస్తూ మహేష్ పట్ల తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టారు. అయితే మహేష్ పట్ల ప్రేమను కనపరుస్తూనే మరొక స్వీట్ సెటైర్ కూడ మహేష్ పై వేసారు కెటిఆర్. 
MINISTER KTR ALONG WITH MAHESH AND KORATALATV 9 DISCUSSION PROGRAMME PHOTOS కోసం చిత్ర ఫలితం
ఎప్పుడు బౌన్సర్ల మధ్య తన అభిమానులకు దొరకకుండా తిరిగే మహేష్ అమ్మాయిలు అడిగితే చాలు వెంటనే సెల్ఫీలు ఇస్తాడని అయితే అబ్బాయిలకు మాత్రం ఎంతో కష్టపడితే కాని మహేష్ తో సెల్ఫీలు దొరకవని చెపుతూ మహేష్ కు అబ్బాయిలు కన్నా అమ్మాయిల పైనే ప్రేమ అంటూ మరో జోక్ వేసి మహేష్ ను కార్నర్ చేసారు కెటిఆర్. ‘VISION FOR A BETTER TOMORROW’ శీర్షికతో నిర్వహింపబడిన ఈచర్చా గోష్టిలో అనేక ఆలోచనాత్మకమైన ప్రశ్నలకు కెటిఆర్ కొరటాల మహేష్ లు ఏమాత్రం తడబడకుండా సమాధానాలు ఇవ్వడంతో సుమారు ఒక గంటకు పైగా సాగిన ఈ చర్చా గోష్టి కార్యక్రమం అత్యంత ఆసక్తి దాయకంగా జరిగింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: