రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, వంటి వారితో సినిమాలు తెరకెక్కించిన దర్శకులు ఈరంకి శర్మ (93) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలో స్థిరపడిన ఆయన.. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లి.. అక్కడికక్కడే కుప్పకూలారు. మచిలీపట్నానికి చెందిన శర్మ అసలు పేరు ఈరంకి పురుషోత్తమశర్మ. మచిలీపట్నంకి చెందిన ఈరంకి శర్మ తన తండ్రి చనిపోవడంతో చెన్నైకి వెళ్లారు.

తన సోదరుడు దర్శకత్వం వహించిన ‘చిన్నమ్మ కథ’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారాయన. వేదాంతం రాఘవయ్య, కె.బాలచందర్‌ సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు ఎడిటర్‌గానూ చేశారు.1977లో రజనీకాంత్‌ నటించిన ‘చిలకమ్మ చెప్పింది’తో దర్శకునిగా మారారు. ఆ సినిమాకి బంగారు నంది అవార్డు అందుకున్నారు.

ఆ తర్వాత తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రం కూడా బంగారు నంది గెల్చుకుంది. చిరంజీవి, మాధవిలతో ‘కుక్కకాటుకి చెప్పుదెబ్బ’ సినిమా తీశారు. ఆ తర్వాత ‘అగ్నిపుష్పం, సీతాదేవి’ వంటి చిత్రాలు తెరకెక్కించారు.
Cini Director Eranki Sharma Passes Away - Sakshi
ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.  శర్మకు కుమారుడు ప్రసాద్‌, కుమార్తె కవిత ఉ న్నారు. మూడేళ్లక్రితమే ఆయన భార్య కన్నుమూశారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: