తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హాస్య బ్రహ్మ జంద్యాల, నవ్వుల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈవివివి సత్యనారాయణ లాంటి వారు తీసిని చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లో కడుపుబ్బా నవ్వించేలా ఉండేవి..ఈ మద్య కామెడీ చిత్రాల్లో వల్గారిటీ ఎక్కువ..బోర్ కొట్టించే విధంగా ఉంటున్నాయని టాక్ వినిపిస్తుంది.  ఈవివివిసత్యనారాయణ దర్శకత్వంలో సినియర్ నరేష్, ఆమని నటించిన ‘జంబ లకిడి పంబ’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 
Image result for srinivas reddy jambalakidi pamba
ఈ సినిమా లో మగవాడు ఆడవారిగా..ఆడవారు మగవారిగా మారి చేసి చిత్ర విచిత్రాలు ప్రతిక్షణం నవ్వులు పూయించాయి..ఇక బ్రహ్మానందం నటన ఈ చిత్రంలో హైలెట్ అని చెప్పొచ్చు.  తాజాగా అదే టైటిల్‌తో, అటువంటి కథాంశంతో నటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా, సిద్ది ఇద్నాని హీరోయిన్‌గా జేబీ మురళీ కృష్ణ దర్శకత్వంలో మళ్లీ రెండున్నర గంటలు నవ్వులు పూయించడానికి మరో సినిమా వచ్చేస్తోంది.
Image result for srinivas reddy jambalakidi pamba
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ అలరించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.  ఈ పోస్టర్ లో హీరో నైటీ వేసుకొని హీరోయిన్ అబ్బాయిల పాయింట్ షర్ట్ వేసుకున్నట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ చిత్రం కూడా అప్పటి  ‘జంబ లకిడి పంబ’ తలపిస్తుందా అన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: