తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ  దర్శకత్వంలో సీనియర్ నరేష్, ఆమని జంటగా నటించిన ‘జంబలకిడి పంబ’ సెన్సేషనల్ విజయం సాధించింది.  అప్పటి వరకు రానీ కొత్త కాన్సెప్ట్ తో ఈవీవీ తెరకెక్కించిన ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ఆడవాళ్లు మగాళ్లుగా మారడం..మగాళ్లు ఆడవారిగా మాట్లాడటం సినిమాకు హైలెట్.  ముఖ్యంగా కోటా, బ్రహ్మానందం, బాబు మోహన్ చేసే కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక జంబలకిడి పంబ టైటిల్తో మరో చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించనుంది.
Image result for srinivas reddy jambalakidi pamba
గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలలో సోలో హీరోగా నటించిన శ్రీనివాస రెడ్డి ప్రధానపాత్రలో మరో జంబలకిడి పంబ తెరకెక్కుతుంది.  జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి. ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జంబలకిడి పంబ. ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని తెలుస్తుంది.

గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, అరకు, వైజాగ్, కేరళ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదల చేశారు.  ‘నాకు విడాకులు కావాలి అని హీరోయిన్ అంటే..నాకు మాత్రం మావిడాకులు కావాలా..నాకూ విడాకులు కావాలి’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. 

చిత్రంలో మొదటి భార్యభర్తల మద్య అపార్థాలు చోటు చేసుకొని తర్వాత జరిగే పరిణామాలు చాలా కామెడీగా ఉంటాయనిపిస్తుంది. ఇందులో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముంబై మోడల్ సిద్ధి ఇద్నానీ ఈ చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అవుతుంది. టీజర్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: