తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకులు కొరటాల శివ బీటెక్ పూర్తిచేసి, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం మరియు ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.  ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ ఈ మద్య మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
Image result for bharath ane nenu
ఇప్పటి వరకు కొరటాల తన సినిమాల్లో మెసేజ్ కి సంబంధించిన విషయాలు చెబుతూ వచ్చారు.  హీరో, హీరోయిన్ల పై ప్రేమ కథ ఉన్నా అది నామమాత్రంగానే చూపిస్తూ వచ్చారు.   ఇక భరత్ అనే నేను తర్వాత కొరటాల ఎలాంటి సినిమా తీయబోతున్నారని క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఏ హీరోతో చేయనున్నాడు? ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నాడు? అనే ఆసక్తి అందరిలోనూ వుంది.
Image result for akhil
అయితే ఈ సినిమాలో ఎలాంటి సందేశం ఉండదని సమాచారం. ఈ సినిమా వరకూ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనను ఆయన పక్కన పెట్టేస్తున్నాడట.  పూర్తిగా రొమాంటిక్, లవ్ స్టోరీతో తెరకెక్కించబోయే ఈ చిత్రానికి హీరో నిఖిల్ అని టాక్ వినిపిస్తుంది.  ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.  ఇప్పటికీ రెండు సినిమాల్లో నటించిన అక్కినేని కుర్రోడికి పేరు మాత్రం పెద్దగా రాలేదు..మరి కొరటాల దర్శకత్వంలో అయినా మంచి హిట్ కొడతాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: