యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  సినిమా అన‌గానే... టైటిల్‌లోనే ఓ హుషారు, పౌరుషం క‌నిపించాలి. అప్పుడే అభిమానులు ఖుషీ అవుతారు. ఇప్పుడు ఆయ‌న మ‌రో ప‌వ‌ర్ఫుల్ టైటిల్ గురించి అభిప్రాయం సేక‌రించే ప‌నిలో నిమ‌గ్నమై ఉన్నారు. 
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో త్వర‌లోనే ఓ చిత్రం ప్రారంభం కాబోతోంది.

ఈ సినిమాకి హ‌డ‌ల్ అనే పేరు ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇప్పటికే టైటిల్‌ని రిజిస్ట్రేష‌న్ కూడా పూర్తి చేశార‌ట‌. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ టైటిల్ గురించి త‌న‌కు తెలిసిన ద‌ర్శకులంద‌రి అభిప్రాయాన్ని సేక‌రిస్తున్నాడ‌ట‌. మాస్ ప్రేక్షకుల‌కు నచ్చుతుంది కానీ.. ఇత‌ర అన్నివ‌ర్గాల ప్రేక్షకుల‌కు చేరువ‌య్యేలా పేరుందా లేదా అని అడిగి తెలుసుకొంటున్నారు. 

మిర్చి సినిమాతో త‌న స‌త్తాని చాటిన కొర‌టాల శివ‌... ఎన్టీఆర్‌తోనూ అదే త‌ర‌హాలో ఓ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది.  ఈ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: