తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు వచ్చాయి. అయితే అవన్నీ అభిమానులకు ఎంట్రటైన్ మెంట్ యాంగిల్ లో నడిచాయి.  అయితే కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ ఒక అద్భుతమైన మేసేజ్ తో తీశారు.  చాలా మంది గ్రామీణ స్థాయి నుంచి వచ్చారు..అయితే పట్టణాల్లో స్థిరపడి ఆస్తులు సంపాదించే వారు తమ ఊరికి ఎంతోకొంత సహాయం చేస్తే గ్రామాలు బాగుపడతాయని..ఊరిని దత్తత తీసుకొని ఎంతో కొంత సహాయం చేస్తే ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారన్న మెసేజ్ అందరి మనసులను టచ్ చేసింది.
Related image
అంతే కాదు చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కొన్ని గ్రామాలు దత్తత కూడా తీసుకున్నారు.  తాజాగా  వక్కంతం దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” మంచి విజయం సాధించింది.  ఈ చిత్రంలో బన్నీ..ఆర్మీ అధికారి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని దేశ భక్తి, దేశం విలువ, ఆర్మీకి సరైన నిర్వచనాన్ని ప్రేక్షకులను ఇచ్చాడు. 
Image result for naa peru surya
తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ..నా ఇండియన్స్ అందరికి నమస్కారం.. ఇప్పటి వరకు నేను ఎన్నో చిత్రాల్లో నటించానని..అవన్నీ కమర్షియల్ మూవీస్ అని..కానీ నాపేరు సూర్య చిత్రం విషయం పూర్తిగా వేరు అని అన్నారు. 
Image result for naa peru surya
 ఈ సినిమాతో ఆర్మీ పట్ల చాలా గౌరవం పెరిగింది. నేను ఇండియన్ ఆర్మీ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అందుకు సంబంధించి పేపర్స్ కూడా ఇచ్చాను. త్వరలోనే ఆర్మీ లో జాయిన్ అవుతున్నా.. జైహింద్” అని తెలిపారు. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: