ఈరోజు విడుదల అవుతున్న ‘మహానటి’ మూవీని ప్రమోట్ చేస్తూ యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన విచిత్ర వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈరోజు మే 9న ‘మహానటి’ రిలీజ్ చేయడం నిర్మాత నిర్ణయమని తన పుట్టినరోజు కారణం అని కొన్ని మీడియా సంస్థలలో వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ కామెంట్ చేసాడు. 
VIJAY DEVARAKONDA MEDIA INTERVIEW PHOTOA కోసం చిత్ర ఫలితం
అంతేకాదు తనకు బర్త్ డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టం లేదు అనిఅంటూ బర్త్ డే కంటే తన  సినిమాలు బాగా విజయవంతం అయి తన నటనకు మంచి ప్రశంసలు లభిస్తే అది తనకు తన పుట్టినరోజు కంటే ఎక్కువ అని అంటూ సినిమాల పై తన ప్రేమను బయటపెట్టాడు విజయ్ దేవర కొండ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత  తనకు ఏర్పడిన క్రేజ్‌ ను చూసి ‘మహానటి’ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులను థియేటర్స్ కు రావద్దని విచిత్రమైన పిలుపు ఇచ్చాడు. 
సంబంధిత చిత్రం
అలా వస్తే అంతకన్నా ఫూలిష్‌ నెస్ ఏముండదు అని అంటూ ‘మహానటి’ తన మూవీ కాదనీ కేవలం ‘మహానటి’ సావిత్రిని చూసేందుకే ఈసినిమాకు రావాలని పిలుపు ఇస్తున్నాడు ఈహీరో. అంతేకాదు తన పాత్రతో పాటు మధురవాణి పాత్రను పోషిస్తున్న సమంత పాత్ర కూడ సపోర్టింగ్ పాత్ర మాత్రమే అని అంటూ మరొకసారి క్లారిటీ ఇస్తూ సావిత్రి కోసమే ధియేటర్స్ కు రమ్మని చెపుతున్నాడు విజయ్ దేవరకొండ.
VIJAY DEVARAKONDA MEDIA INTERVIEW PHOTOA కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి ‘మహానటి’ సినిమాలో ముఖ్యమైన జెమినీ గణేషన్ పాత్రకు తనను అడిగిన సందర్బాన్ని వివరిస్తూ ఆఆఫర్ గురించి తాను ఆలోచించేలోపే దుల్కర్ ను ఫైనలేజ్ చేసారు అన్న మెసేజ్ వచ్చినప్పుడు తాను బాధపడిన విషయాన్ని వివరించాడు. ఈరోజు విడుదల అవుతున్న ‘మహానటి’ లో సావిత్రి పాత్రతో సమానంగా విజయ్ దేవర కొండ సమంతల లవ్ ట్రాక్ పెద్దదిగా ఉంటుంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈమూవీ నిర్మాతలు విజయ్ చేత ఈ క్లారిటీ ఇప్పించి ఇది మహానటి సావిత్రి సినిమా మాత్రమే అన్న ఫీలర్ జనంలోకి ఇప్పిస్తున్నారనుకోవాలి..   
.


మరింత సమాచారం తెలుసుకోండి: