మహానటి సినిమాకి అందుతున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలోని ప్రతి ఫ్రేమును ఆస్వాదిస్తున్నారంటే.. ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  చిన్న వయసు అయినా..ఎంతో సీనియర్ దర్శకుడి లా సాహసం చేసి తెరపైకి తీసుకు వచ్చిన నాగ్ అశ్విన్ కి ఇండస్ట్రీలో నుంచి ప్రశంసల జల్లు అందుతున్నాయి. 
Political leaders praising Mahanati
మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించలేదని..జీవించిందని అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఇక సావిత్రి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఒక్క సావిత్రి పాత్రనే కాదు కేవీరెడ్డి, చక్రపాణి, ఎల్వీ ప్రసాద్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి మహామహుల పాత్రలను అచ్చుగుద్దినట్టు దింపేశాడు.  సిసీ స్టార్ల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తున్నారు. మహానటి సినిమా చూశానని, అసామాన్య నటి సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ బయోపిక్‌ను అద్భుతంగా తెరకెక్కించారని జయప్రకాశ్ నారాయణ కితాబు ఇచ్చారు. 
Image result for మ‌హాన‌టి
సినిమా చూసిన వెంటనే మంత్రి కేటీఆర్ కూడా చాలా అద్భుతమైన సినిమా అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు వచ్చాయని..తాను సావిత్రి కి ఎంతో అభిమానినని అంత గొప్ప సినిమా అందించిన నాగ్ అశ్విన్ గొప్పదర్శకుడు అవుతాడని ప్రశంసించారు. ఈ మూవీ విడుద‌లైన అన్ని ప్రాంతాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది.
Image result for మ‌హాన‌టి
ఒక మ‌హాన‌టి జీవిత‌ క‌థ మూవీకి ఆమెరికాలోని తెలుగు వారు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. ఇప్ప‌టికే ఈ మూవీ ఏకంగా 9.30 ల‌క్ష‌ల డాల‌ర్లు రాబ‌ట్టింది.. ఈ రోజు శ‌నివారం కావ‌డంతో మిలియ‌న్ డాల‌ర్లు మార్క్ సాధిస్తుంద‌ని అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్స్ అంటున్నారు..ఈ మూవీలో స‌ల్మాన్ దుల్క‌ర్, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌కాష్ రాజ్, మోహ‌న్ బాబు త‌దిత‌రులు న‌టించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: