సినిమా ఇండస్ట్రీలో సంచలనాలకు కేంద్ర బింధువు అయిన రాంగోపాల్ వర్మ సినిమాల కన్నా తన వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు.  ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన చేసే కామెంట్స్ చూస్తుంటే వర్మ పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిందా అన్న అనుమానాలు వస్తుంటాయి. తన  మనసులో ఏ భావన ఉంటే అది ట్విట్టర్ ద్వారా వెల్లబుచ్చడం వర్మకు సాంప్రదాయంగా మారిపోయింది. ఆ మద్య రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై కూడా ఇదే తరహా చిల్లర కామెంట్స్ చేశారు వర్మ.
Image result for ravi teja pawan
రాజమౌళి మల్టీస్టారర్ సందర్భంగా ట్విట్టర్‌లో పెట్టిన ఫోటోపై స్పందిస్తూ.. ఆ ముగ్గుర్నీ గే లంటూ ప్రచారం చేశాడు వర్మ. ‘స్త్రీని ఆరాధించే వ్యక్తిగా నిస్సిగ్గుగా చేస్తున్న ఈ గే కల్చర్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’ ‘ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురూ ఆ టైపేనా.. పైగా ముగ్గురూ కూడా పెళ్లయిన వాళ్లు.. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. బాలాజీ గారు మీరైనా చెప్పండి!’ అని వెటకారంగా వ్యాఖ్యలు చేసి మెగా, నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు.  ఇక పవన్ కళ్యాన్ అంటే ఒంటికాలిపై లేచే వర్మ తాజాగా మరో ఛండాలం ట్వీట్ చేసి పవన్ ఫ్యాన్స్ ఆగ్రమానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఇటీవల ‘నేల టిక్కెట్టు’ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చాలా సరదాగా ఉంటూ.. రవితేజ పక్కనే కూర్చుని అతడు వేసుకున్న టార్న్ జీన్స్ ఫ్యాంటు‌పై  జోకులు వేశారు. రవితేజ న్యూ ట్రెండ్‌ను ఫాలో అవుతూ అంతకంతకూ యంగ్‌గా అయిపోతున్నారంటూ జోకులు పేల్చుతూ.. రవితేజ వేసుకున్న టార్న్ జీన్స్ ఫ్యాంట్‌ను ఆసక్తిగా పట్టుకుని చూశారు. ఆ టైంలో కెమెరాలు ఫోకస్ చేయడంతో పవన్.. రవితేజ తొడపై చేయి వేసినట్టుగా కనిపించింది. ఇక సోషల్ మీడియాలో పవన్ యాంటీ ఫ్యాన్స్ ఈ ఫోటోను ట్రోల్ చేశారు.
Image result for ravi teja pawan nela ticket\
ఈ ఫోటో, వీడియో వైరల్ ఆయ్యాయి. అంతే వర్మకు జాంపండు దొరికినట్లు వెంటనే తనదైన స్టైల్లో ట్వీట్ చేశాడు. అజ్ఞాతవాసి’ పవన్ కళ్యాణ్‌లో ఈ యాంగిల్ కూడా ఉన్నదని ఎక్స్‌ప్రెషన్‌ని బట్టి రవితేజ మొహంలో క్లియర్‌గా ‘టచ్ చేసి చూడు’ టైప్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. కాని ఈ సీక్రెట్ మెగా ఫ్యామిలీకి జనసేన పార్టీకి తెలిసుండదు. బట్ పీకే గిల్లుడులో ‘నేల టిక్కెట్టు’ కనెక్షన్స్ కనిపిస్తున్నాయిపవన్ కళ్యాణ్ కాని.. రవితేజ తొడ మీద ఉన్న తన అత్యంత శ్రద్ధని జస్ట్ సగం రెండు రాష్ట్రాల మీద పెడితే అబ్బో.. అత్యంత సస్యశ్యామలం.

రవితేజ ఎడమ తొడకి.. పవన్ కళ్యాణ్ కుడి చేతికి ఉన్న అవినవభావసంబంధం ఆ దేవుడికే తెలియాలి’. రవితేజకి పవన్ కళ్యాణ్‌కి మధ్యలో ఉన్న ఈ తొడ సంబంధం గురించి లోగుట్టు జనసేన వాళ్లకే తెలియాలి. కాని పీకేకి.. రవితేజ ఎడమ తొడ మీద చాలా మక్కువ ఉందున్న విషయం పీకే మొహంలో ఉన్న ఆనందంలో కనబడుతుందంటూ’ మితిమీరి వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: