‘బాహుబలి’ మూవీతో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ కూడ ‘మహానటి’ మూవీని చూసి ఈర్ష్య పడుతున్నాడా అంటూ కొందరు ఒకకొత్త చర్చను లేవనేత్తుతున్నారు. దీనికికారణం కొద్దిరోజుల క్రితం అల్లుఅరవింద్ కుటుంబం ‘మహానటి’ యూనిట్ ను సత్కరిస్తూ జరిపిన ఫంక్షన్ లో అనుకోకుండా రాజమౌళి నోటివెంట వచ్చిన మాటలు అనిఅంటున్నారు. ‘మహానటి’ మూవీ గురించి రాజమౌళి విపరీతంగా పొగుడుతూ ఈసినిమాను గాడ్ ఫాదర్ గా వెనక నుండి నడిపించిన అశ్వినీదత్ ను అదేవిధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ను పొగుడ్తూ సన్మానిస్తున్నారు. 
RAJAMOULI AT MAHANATI SUCESS MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
కానీ అసలు సన్మానం చేయవలసింది ఈసినిమా నిర్మాతలు అయిన అశ్వినీదత్ కుమార్తెలకు అంటూ రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఇలాంటి గొప్ప సినిమాను తాను ఎందుకు తీయలేకపోయానా అన్న బాధకలుగుతోంది అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈకామెంట్స్ యధాలాపంగా అన్నవి కావనీ రాజమౌళి హృదయం నుండి వచ్చిన మాటలు అని అంటున్నారు. 
సంబంధిత చిత్రం
‘బాహుబలి’ కోసం చాలకష్టపడి కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేసినా రాజమౌళికి ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడు అవార్డు రాలేదు. రాజమౌళి అనుభవం వయసుతో పోల్చుకుంటే చాలచిన్నవాడు అయిన నాగ్ అశ్విన్ కు ‘మహానటి’ ద్వారా ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చినా ఆశ్చర్యంలేదు అనిఅంటున్నారు. దీనికితోడు ఈసినిమా చూసి తీరాలన్న భావన అందరిలోనూ కలిగిస్తూ మీడియా ఇప్పటికీ వార్తలు వ్రాస్తూ ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తోంది. 
RAJAMOULI AT MAHANATI SUCESS MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఇలాంటి సహకారం మీడియా నుండి ‘బాహుబలి’ విషయంలో డబ్బు ఖర్చు పెట్టకుండా ‘బాహుబలి’ కి రాలేదు అన్న బాధ రాజమౌళి మనసులో ఉంది అని అంటారు. దీనికితోడు ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు ఈసినిమాను అభినందించడానికి చిత్రబృందాన్ని సత్కరించడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. దీనివల్ల ‘మహానటి’ పై విపరీతమైన గౌరవం పెరుగుతోంది. ఇలా ఇండస్ట్రీ అంతా ఒకసినిమాను నెత్తికెత్తుకోవడం ‘బాహుబలి’ విషయంలో ఎందుకు జరగలేదు అన్న ఫీలింగ్ రాజమౌళి మనసులో ఉందని అంటున్నారు. దీనితో ‘మహానటి’కి దక్కుతున్న గౌరతో పోలిస్తే తానెంతో కష్టపడి తీసిన ‘బాహుబలి’ కి గౌరవం విషయంలో తక్కువ లభించింది అన్నఫీలింగ్ రాజమౌళి మనసులో ఉంది అంటారు. ఈవిషయాలు ఎంతవరకు యదార్ధమో తెలియకపోయినా ‘మహానటి’ ఫంక్షన్ లో రాజమౌళి అన్న మాటలలో ఎన్నో అర్ధాలు ఉన్నాయి అనిఅంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: