సినిమాలకు విరామం ప్రకటించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజానాయకుడుగా మారిపోయి రాబోతున్న ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా అవడానికి ప్రయత్నిస్తున్న నేపధ్యంలో పవన్ బ్యాగ్ సెంటిమెంట్ ఒకటి బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్  కు  పుస్తకాలు చదవడం బాగా అలవాటు అన్న విషయం అందరికీ తెలిసిందే. 
PAWAN KALYAN BUS YATRA PHOTOS కోసం చిత్ర ఫలితం
పవన్ కళ్యాణ్ ఇల్లు ఒక మినీ లైబ్రరీలా ఉంటుందని చాలామంది చెపుతూ ఉంటారు. పవన్ ఇంటిలో వేలసంఖ్యలో రకరకాల అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. అయితే లేటెస్ట్ గా ‘ప్రజాపోరాటయాత్ర’ పేరుతో బస్సు యాత్ర చేయబోతున్న పవన్ బస్సులో పవన్ తో పాటు   అతడు చాలా లక్కీ అని భావించే ఒక బ్యాగ్ కుడా పవన్ పక్కనే ఉండబోతుందని సమాచారం.
PAWAN KALYAN BUS YATRA PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈబ్యాగ్ తన పక్కన ఉంటే అన్ని విషయాలలో విజయం వస్తుందని నమ్మకం అంటారు. ఈబ్యాగ్ కు పవన్ కు మధ్య 17 సంవత్సరాల బంధం ఉంది.  పవన్ కు టాప్ హీరో ఇమేజ్ ఇచ్చిన ‘ఖుషి’ చిత్రం షూటింగ్ లో ఈబ్యాగ్ ను పవన్ ముచ్చటపడి కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ విడుదలై 17 ఏళ్ళు దాటిపోయినా పవన్ తన బ్యాగ్ లు ఎన్నో మార్చాడు కానీ తనకు లక్ ను ఇచ్చిన ఈబ్యాగ్ ను మాత్రం పవన్ తన టూర్ లో ఎప్పుడు తన పక్కనే పెట్టుకుంటాడు అని అంటారు. 
PAWAN KALYAN BUS YATRA PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఈ బ్యాగ్ లో తనకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ అంబేత్కర్ భవనంలో సామాన్య వ్యక్తిగా బసచేస్తూ రేపటి నుంచి తన బస్సు యాత్ర ప్రారంభించబోతున్నాడు. స్టార్ హోటల్స్ లో ఉండేందుకు నిరాకరిస్తూ పవన్ ఖరీదైన బస్సులో అతిసామాన్యమైన జీవితాన్ని గడుపుతూ జరపబోతున్న ఈ ‘ప్రజాపోరాటయాత్ర’ కు పవన్ పక్కనే ఉండబోతున్న ఈ బ్యాగ్ ఎలాంటి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: